‘నిందితుడు మంత్రికాన్వాయ్‌లో తిరుగుతుంటే...’ | Wildlife law is not enforcement in Telangana | Sakshi
Sakshi News home page

‘నిందితుడు మంత్రికాన్వాయ్‌లో తిరుగుతుంటే...’

Published Tue, Apr 4 2017 7:11 PM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

‘నిందితుడు మంత్రికాన్వాయ్‌లో తిరుగుతుంటే...’

‘నిందితుడు మంత్రికాన్వాయ్‌లో తిరుగుతుంటే...’

హైదరాబాద్‌: మహాదేవ పురం జింకల వేట కేసులో అధికారపార్టీకి చెందిన నేతలు ఉన్నారని, రెండేళ్ళుగా జింకల వేట సాగుతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారని తెలంగాణ బీజేఎల్పీ నేత కిషన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి కాన్వాయ్లో నిందితుడు అక్బర్ ఖాన్ తిరుగుతున్నా ఎందుకు ఇంతవరకూ పట్టుకోలేదని అడిగారు. తుపాకులు చూపి దాడులు చేస్తే ఎందుకు కేసులు పెట్టరని ప్రశ్నించారు.

తెలంగాణలో వన్య ప్రాణి చట్టం అమలు కావటం లేదని.. సీఎంకు చిత్త శుద్ధి ఉంటే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అసలు దోషులను పక్కన పెట్టి.. కిరాయి దోషులను పట్టుకున్నారని, ప్రభుత్వం న్యాయ విచారణ జరపక పోతే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement