పద్దెనిమిది ఏళ్ల క్రితం నాటి అక్రమాయుధాల కేసు నుంచి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు విముక్తి లభించింది. ఈ కేసులో జోధ్‌పూర్ న్యాయస్థానం సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. బుధవారం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తీర్పును వెలువరించారు. లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ అక్రమంగా అయుధాలు కలిగి ఉన్నాడని, వాటిని వాడారని చెప్పే సరైన ఆధారాలు లేనందున నిర్దోషిగా ప్రకటించారు. సల్మాన్‌పై ఉన్న 4 కేసుల్లో అక్రమాయుధాల కేసు ఒకటి. చింకారాల వేటకు సంబంధించిన రెండు కేసుల్లో సల్మాన్‌ను రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. రెండు కృష్ణజింకల వేటకు సంబంధించిన కేసు విచారణ కొనసాగుతోంది. గత ఏడాది మార్చిలో సల్మాన్ జోధ్‌పూర్ కోర్టులో వాంగ్మూలాన్ని ఇచ్చారు.