కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్(52)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 1998 నాటి ఈ కేసులో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు అతనిని దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పు అనంతరం సల్మాన్ ఖాన్‌ను పోలీసులు జోధ్‌పూర్ కేంద్ర కారాగారానికి తరలించారు.