అనుష్క
‘నిశ్శబ్దం’ సినిమాలో మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో అనుష్క నటించిన సంగతి తెలిసిందే. ఆమె లుక్‌ని బుధవారం విడుదల చేశారు. ఈ సినిమాలో సాక్షి పాత్రను చేయడానికి అనుష్క ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్నారని తెలిసింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్, మైఖెల్ మ్యాడిసన్, అంజలి, షాలినీ పాండే ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. చిత్రకారిణిగా నటించడం కోసం పెయింటింగ్ ప్రాక్టీస్ చేశారట అనుష్క. మాట్లాడలేనివాళ్లు సైగల ద్వారా సంభాషించుకుంటారు కదా. ఆ సైన్ భాష కూడా నేర్చుకున్నారట అనుష్క. అటు పెయింటింగ్, ఇటు సైగలను ఆరునెలల పాటు అభ్యసించి, సాక్షి పాత్రను చేశారట అనుష్క. ఈ ఏడాది చివర్లో ‘నిశ్శబ్దం’ విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment