
షాలినీ పాండే
సాక్షి మాట్లాడలేరు. కేవలం సైగలతోనే స్పందిస్తారు. ఆ సైగల్ని సరిగ్గా అర్థం చేసుకోగల అమ్మాయి ఒకరున్నారు. ఆమే సోనాలి. సాక్షి గొంతు. ఆ సోనాలి పాత్రను పోస్టర్ ద్వారా సోమవారం పరిచయం చేసింది చిత్రబృందం. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడిసన్, సుబ్బరాజు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. ‘సాక్షి’ అనే మూగ పెయింటర్ పాత్రలో అనుష్క నటించారు. సోనాలి పాత్రలో షాలినీ పాండే నటించారు. ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment