
చిరంజీవి
ప్రస్తుతం ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు చిరంజీవి. మరి.. ఆయన నెక్ట్స్ ఏంటీ? అంటే కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారన్న వార్తలు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలు వాస్తవమేనని, చిరంజీవి– కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఓపెనింగ్ వచ్చే ఏడాది సంక్రాంతికి జరగనుందని కొందరు గాపిస్‌రాయుళ్లు చెబుతున్న మాట. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నారట.
కొరటాల గత చిత్రాలు ‘మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను’ చిత్రాల్లా ఈ చిత్రం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ ప్రొడ్యూస్ చేస్తారని కొందరి ఊహ. ఇక.. ‘సైరా’ దగ్గరకు వస్తే.. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందతున్న సినిమా ఇది. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయిక. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జార్జియాలో జరగనుందని టాక్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు.