ఎంత సీక్రెట్‌గా ఉంచాలనుకున్నా సినిమా విడుదలకు ముందే కొన్ని ముఖ్యమైన సీన్స్ లీకవడం చూస్తుంటాం. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఒక్కొసారి అవి నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కథను హీరో ముందే రివీల్ చేయడంతో నిర్మాతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఆ ప్రముఖ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్‌లో 152వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. చిరంజీవికి జోడిగా హీరోయిన్ కాజల్ నటిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ - మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డితో కలిసి మెగా పవర్‌స్టార్ రాం చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో పలు సినిమా వేడుకలకు హాజరవుతున్న చిరంజీవి.. తాజాగా రానా, సాయిపల్లవి నటిస్తోన్న విరాటపర్వం ట్రైలర్‌ను మార్చి 18న లాంచ్ చేశారు. ఈ సందర్భంగా విరాటపర్వం టీంను ప్రశంసిస్తూనే ఆయన ఆచార్య కథను రివీల్ చేసేశారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ‘విరాటపర్వం’ టీజర్ చూస్తుంటే ఇది నక్సల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ అని తెలుస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే.. నా సినిమా ఆచార్య కూడా నక్సల్ బ్యాక్ గ్రౌండ్ మూవీనే. అయితే ‘ఆచార్య’ ఒక యూనిక్ ఫిల్మ్ అని భావిస్తున్నాను. అలాంటి సినిమా ఈ మధ్య రాలేదనుకుంటున్నాను. కానీ నక్సల్ కథతోనే ‘విరాటపర్వం’ మూవీ రావడం కొంత నిరాశ కలిగించింది. కానీ ఇది మా ‘ఆచార్య’ కంటే ముందు వస్తుంది కాబట్టి ‘విరాటపర్వం’ హిట్ అవ్వాలని కోరుకొంటున్నాను. అలాగే మా సినిమాకు ఈ కథ ప్లస్ అవ్వాలని కూడా నేను ఆశపడుతున్నా' అని పేర్కొన్నారు.
ఇంతకుముందు దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో అచార్య కథ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథలో నక్సల్స్ నేపథ్యం కూడా ఉందంటూ ప్రచారం జరుగుతుంది. వీటిపై చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయినా...చిరంజీవి మాత్రం ఆచార్య కథపై తొందరపడి క్లారిటీ ఇచ్చేశారు. గతంలోనూ పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి..తాను నటిస్తున్న కొరటాల శివ సినిమా గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ అనౌన్స్ కాకముందే.. ఆ వేడుకలో తాను నటిస్తున్న సినిమా పేరు ఆచార్య అంటూ టైటిల్‌ను రివీల్ చేశారు. చదవండి :
బ్రేక్ లేకుండా బిజీబిజీగా మారనున్న మెగాస్టార్
డాక్టర్ రవి శంకర్ నక్సలైట్ రవన్నగా ఎలా మారాడు?
Comments
Please login to add a commentAdd a comment