
‘నిళల్’ పోస్టర్ ; ‘నెట్రిక్కన్’లో...
తంగమే... నయనతారను విఘ్నేష్ శివన్ అలానే పిలుస్తారు. అంటే బంగారమే అని అర్థం. ‘హ్యాపీ బర్త్‌డే తంగమే’ అని బుధవారం తన గర్ల్ ఫ్రెండ్‌కి శుభాకాంక్షలు చెప్పారు విఘ్నేష్. ‘‘నువ్వెప్పుడూ ఇలానే స్ఫూర్తినిస్తూ ఉండాలి. ఇంతే అంకితభావంతో, క్రమశిక్షణతో, ఇలానే నిజాయతీగా కొనసాగాలి. ఎప్పటికీ ఇలానే ఎదుగుతూ ఉండాలి. ఆ దేవుడు నీకెప్పుడూ ఆనందాన్ని, విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతో పాజిటివిటీతో మరో సంవత్సరం ఆరంభం అయింది’’ అని కూడా విఘ్నేష్ పేర్కొన్నారు. కొంత కాలంగా దర్శకుడు విఘ్నేష్, నయన ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఇక పుట్టినరోజు సందర్భంగా నయనతార రెండు లుక్స్‌తో అభిమానులను ఖుషీ చేశారు. ఒకటి తమిళ చిత్రం ‘నెట్రిక్కన్’, ఇంకోటి మలయాళ చిత్రం ‘నిళల్’. ‘నెట్రిక్కన్’ అంటే శివుడి మూడో కన్ను అని అర్థం. ఇందులో నయన అంధురాలిగా నటిస్తున్నారు. నగరంలో వరుస హత్యలకు గురయ్యే యువతుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఓ సీరియల్ కిల్లర్ నయనను అంతం చేయడానికి ప్రయత్నించడం చిత్రం ప్రధానాంశం. ఈ చిత్రాన్ని విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నారు. ‘నిళల్’ మలయాళ సినిమా. నీడ అని అర్థం. ఇందులో హీరోకి దీటుగా ఉండే పాత్రను నయనతార చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment