బిచ్చగాడు 2 | Bichagadu 2 First Look release | Sakshi
Sakshi News home page

బిచ్చగాడు 2

Published Sat, Jul 25 2020 1:44 AM | Last Updated on Sat, Jul 25 2020 4:37 AM

Bichagadu 2 First Look release - Sakshi

విజయ్‌ ఆంటోని

‘బిచ్చగాడు’ సినిమాతో తమిళంలోనే కాదు.. తెలుగులోనూ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సాధించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్‌ ఆంటోని. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతున్న విషయం తెలిసిందే. జాతీయ అవార్డుగ్రహీత ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించనున్నారు.  ఓ వైపు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, మరోవైపు హీరోగా రాణిస్తోన్న విజయ్‌ ఆంటోని పుట్టినరోజు జూలై 24 (శుక్రవారం). ఈ సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ‘బిచ్చగాడు 2’ సినిమా ఫస్ట్‌ లుక్, టైటిల్‌ లోగోను విడుదల చే శారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement