
సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు అరడజనుకుపైగానే ఉన్నాయి. అవన్నీ 2023లో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. కాగా విజయ్ ఆంటోని ఇంతకు ముందు నటించిన పిచ్చైక్కారన్(తెలుగులో బిచ్చగాడు) చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తెలుగులోనూ అనువాదమై మంచి పసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పిచ్చైక్కారన్–2 తెరకెక్కుతోంది.
చదవండి: ఆస్కార్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లిన ‘ఆర్‌ఆర్‌ఆర్’
విశేషమేంటంటే ఈ చిత్రం ద్వారా విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రం శాటిలైట్, డిజిటల్ హక్కులను స్టార్ నెట్ వర్క్ సంస్థ సొంతం చేసుకుంది. 2023లో సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత తెలిపారు.
#ANTIBIKILI 👺#Pichaikkaran2 #Bichagadu2 #Bhikshuka2 #Bhikshakkaran2
— vijayantony (@vijayantony) December 20, 2022
Satellite & Digital rights acquired by Star Network 🔴
Summer 2023 🔥@vijaytelevision @StarMaa @asianet @StarSuvarna @DisneyPlusHS @mrsvijayantony @vijayantonyfilm @DoneChannel1 @gskmedia_pr @gobeatroute pic.twitter.com/w0YPShC1xy