Vijay Antony confirms Bichagadu 3 and will be released in 2025 - Sakshi
Sakshi News home page

Vijay Antony: బిచ్చగాడు 3 ఉంటుంది, ఆ ఏడాది రిలీజ్‌ చేస్తాం..

Published Thu, May 25 2023 8:52 AM | Last Updated on Thu, May 25 2023 9:39 AM

Vijay Antony Confirms Bichagadu 3 and it will be Release in 2025 - Sakshi

ఒక్కో రంగంలో తనను తాను సక్సెస్‌ఫుల్‌గా మలుచుకుంటూ ఎదుగుతూ వస్తున్న నటుడు విజయ్‌ ఆంటోని. ఈయన మొదట్లో సంగీత దర్శకుడిగా రంగప్రవేశం చేశారు. ఆ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ తరువాత 2012లో నాన్‌ అనే చిత్రంతో నిర్మాతగా, కథానాయకుడిగా మారారు. ఆ చిత్రం సక్సెస్‌ అయ్యింది.

అలా వరుసగా నటిస్తూ, మరో పక్క సంగీత దర్శకుడిగానూ రాణిస్తున్న విజయ్‌ ఆంటోని బిచ్చగాడు(పిచ్చైక్కారన్‌) చిత్రంతో సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా ఇటీవల బిచ్చగాడు 2 చిత్రంతో దర్శకుడిగానూ అవతారమెత్తారు. ఈ చిత్రానికి నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా బహుముఖాలను ప్రదర్శించి సక్సెస్‌ అయ్యారు. ఇటీవల విడుదలైన బిచ్చగాడు 2 చిత్రం మంచి వసూళ్లను సాధిస్తోంది.

దీంతో ఈ చిత్రానికి పార్టు 3 ఉంటుందని ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్ర షూటింగ్‌ 2025లో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. అయితే ఇది బిచ్చగాడు 1, 2 సినిమా కథలకు సంబంధం ఉండదని, వేరే విధంగా ఉంటుందని తెలిపారు. కాగా ప్రస్తుతం విజయ్‌ ఆంటోని రత్తం, మళై పిడిక్కాద మణిదన్‌, వల్లి మలై, అగ్నిసిరకుకళ్‌, కొలై చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలు విడుదలైన తరువాతనే బిచ్చగాడు 3 చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు విజయ్‌ఆంటోని చెప్పారు.

చదవండి: తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే ఊరుకోను: హరీశ్‌ శంకర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement