బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..! | Bichagadu Hero Vijay Antony's Daughter Ends Her Life | Sakshi
Sakshi News home page

Vijay Antony: విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..!

Published Tue, Sep 19 2023 7:33 AM | Last Updated on Tue, Sep 19 2023 8:18 AM

Bichagadu Hero Vijay Antony Daughter Commits Suicide With Hanging - Sakshi

బిచ్చగాడు ఫేమ్, కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం నెలకొంది. 12వ తరగతి చదువుతున్న ఆయన కూతురు మీరా ఆంటోని సూసైడ్ చేసుకుంది. అయితే అమ్మాయిని గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది. తీవ్రమైన ఒత్తిడితోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: ప్రిన్స్‌ ఒక వెధవ.. ప్రశాంత్‌కు డ్రగ్‌ ఎక్కేసింది: షకీలా)

కోలీవుడ్  హీరో విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నైలోని అల్వార్‌పేటలోని డీడీకే రోడ్డులో నివాసముంటున్నారు. విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ (16) చర్చ్ పార్క్ స్కూల్‌లో పన్నెండో తరగతి చదువుతోంది. అయితే చదువుల వల్లే ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. మీరా తెల్లవారుజామున 3 గంటల సమయంలోనే తన గదిలో ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మీరాను గమనించిన కుటుంబసభ్యులు కావేరీ ఆస్పత్రికి తరలించగా..  అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన జరిగిన సమయంలో విజయ్‌ ఆంటోని ఇంట్లో లేడని చెబుతున్నారు.

Disclaimer: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement