
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తెలుగులోనూ ఆయనకు సూపర్ క్రేజ్‌ను తెచ్చిపెట్టిందీ సినిమా. దీంతో ఇప్పుడు రానున్న బిచ్చగాడు-2పై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై మాంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. మే 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?
లక్ష కోట్లకు వారసుడైన ధనవంతుడిగా విజయ్ ఇంట్రడక్షన్ అదిరిపోతుంది. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ చుట్టూ కథను నడిపించినట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. కావ్య థాపర్, దేవ్ గిల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment