స్టార్ హీరోయిన్ నయనతార దంపతుల సరోగసి వివాదంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ పూర్తి చేసింది. రేపు(బుధవారం) తమిళనాడు సర్కారుకు కమిటీ సభ్యులు నివేదిక అందించనున్నారు. కాగా లేడీ సూపర్‌స్టార్ నయనతారదంపతుల సరోగసి వివాదం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.
సరోగసి విధానంలో నిబంధనలు పాటించలేదంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంగళరం ఈ విచారణ పూర్తయింది. ఈ క్రమంలో నయన్ దంపతలు కమిటీకి అపిడవిట్ పంపారు. తమకు ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ అయ్యిందని తెలిపారు.
గతేడాది డిసెంబర్‌లోనే సరోగసి కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఇందులో నిబంధనలు అతిక్రమించలేదని పేర్కొన్నారు. ఈ వివాదంపై విచారణ పూర్తిచేసిన కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందిచనున్న నేపథ్యంలో నివేదికలో ఏం ఉండనున్నదనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment