Tri members committee
-
నయన్ దంపతుల సరోగసిపై ప్రభుత్వం ఏం తేల్చనుంది?
స్టార్ హీరోయిన్ నయనతార దంపతుల సరోగసి వివాదంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ పూర్తి చేసింది. రేపు(బుధవారం) తమిళనాడు సర్కారుకు కమిటీ సభ్యులు నివేదిక అందించనున్నారు. కాగా లేడీ సూపర్‌స్టార్ నయనతారదంపతుల సరోగసి వివాదం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. సరోగసి విధానంలో నిబంధనలు పాటించలేదంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంగళరం ఈ విచారణ పూర్తయింది. ఈ క్రమంలో నయన్ దంపతలు కమిటీకి అపిడవిట్ పంపారు. తమకు ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ అయ్యిందని తెలిపారు. గతేడాది డిసెంబర్లోనే సరోగసి కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఇందులో నిబంధనలు అతిక్రమించలేదని పేర్కొన్నారు. ఈ వివాదంపై విచారణ పూర్తిచేసిన కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందిచనున్న నేపథ్యంలో నివేదికలో ఏం ఉండనున్నదనే దానిపై సస్పెన్స్ నెలకొంది. -
నయనతార, విఘ్నేష్ సరోగసీ వివాదానికి తెర!
తమిళ సినిమా: ప్రముఖ సినీ నటి నయనతార, సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ వివాదానికి పుల్‌స్టాప్ పడినట్లు కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వారు సరోగసీ విధానంలో కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడంపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించేందుకు తమిళనాడు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ కూడా చేపట్టింది. నయనతార తన సరోగసీ విధానానికి సంబంధించిన పూర్తి ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాము ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మేరేజ్ చేసుకున్నట్లు ధ్రువీకరించే సర్టిఫికెట్లను నయనతార ఆ కమిటీకి అందించినట్లు సమాచారం. అదే విధంగా గత డిసెంబర్లో అద్దె గర్భం కోసం రిజిస్టర్ చేసుకుని.. ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులు కావాలంటే వివాహమై ఐదేళ్లు పూర్తి కావాల్సి ఉంది. -
నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలంలోని లభ్యత జలాలు, ఇరు తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ శుక్రవారం మధ్యాహ్నం జలసౌధలో భేటీ కానుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల ఎగువన లభ్యతగా ఉన్న 36 టీఎంసీల జలాల్లో ఏపీ కోటా పూర్తయిన నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇందులో చర్చించనున్నారు. దీనికి బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంతో పాటు తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావులు హాజరు కానున్నారు. లభ్యత జలాల నుంచే సర్దుబాటు చేయడమా.. లేక కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లి నీటిని తోడటమా అనే దానిపై భేటీలో చర్చించనున్నారు. -
లైంగిక వేధింపుల విచారణకు త్రిసభ్య కమిటీ
నెహ్రూనగర్ : నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అంగడి రాజేష్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ పారిశుద్ధ్య కార్మికురాలు నగర కమిషనర్‌కు, డీఎంఏ కార్యాలయానికి పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయడం విదితమే. దీనిపై విచారణకు ప్రజారోగ్యాధికారి నాగేశ్వరరావును కమిషనర్ నియమించారు. విచారణ జరుగుతుండగానే మరో ముగ్గురు అధికారులను సమగ్ర విచారణ నిమిత్తం ప్రత్యేక కమిటీగా కమిషనర్ నాగలక్ష్మి ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో∙డిప్యూటీ కమిషనర్ ఏసుదాసు, శానిటరీ సూపర్ వైజర్ రాజ్యలక్ష్మి, సెక్రటరీ వసంతలక్ష్మిని ప్రత్యేక కమిటీగా నియమించారు. దీనిపై పూర్తి సమాచారం సేకరించి బుధవారం సాయంత్రానికి తనకు అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు.