తమిళ సినిమా: ప్రముఖ సినీ నటి నయనతార, సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ వివాదానికి పుల్‌స్టాప్ పడినట్లు కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వారు సరోగసీ విధానంలో కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడంపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించేందుకు తమిళనాడు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ కూడా చేపట్టింది.
నయనతార తన సరోగసీ విధానానికి సంబంధించిన పూర్తి ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాము ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మేరేజ్ చేసుకున్నట్లు ధ్రువీకరించే సర్టిఫికెట్లను నయనతార ఆ కమిటీకి అందించినట్లు సమాచారం. అదే విధంగా గత డిసెంబర్‌లో అద్దె గర్భం కోసం రిజిస్టర్ చేసుకుని.. ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులు కావాలంటే వివాహమై ఐదేళ్లు పూర్తి కావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment