రౌడీ నా జీవితాన్ని మార్చింది! | Nayanthara celebrates 9 years of Nenu Rowdy movie | Sakshi
Sakshi News home page

రౌడీ నా జీవితాన్ని మార్చింది!

Published Wed, Oct 23 2024 2:39 AM | Last Updated on Wed, Oct 23 2024 2:39 AM

Nayanthara celebrates 9 years of Nenu Rowdy movie

‘‘నానుమ్‌ రౌడీదాన్‌’ (నేనూ రౌడీనే) సినిమా నా కెరీర్‌లో మర్చిపోలేని అనుభూతుల్ని మిగిల్చింది’’ అంటున్నారు హీరోయిన్‌ నయనతార. విజయ్‌ సేతుపతి, నయనతార జంటగా విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనూ రౌడీనే’. 2015 అక్టోబరు 21న విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ స్టిల్స్‌తో కూడిన ఓ వీడియోను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు నయనతార. ‘‘నేనూ రౌడీనే’ సినిమా నా జీవితాన్ని పూర్తిగా మార్చింది.

నా కెరీర్‌ను గొప్పగా మలుపు తిప్పిన ఈ చిత్రం తొమ్మిదేళ్ల కిత్రం విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని మరచిపోలేని అనుభూతుల్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు విఘ్నేశ్‌కు కృతజ్ఞతలు. ఈ సినిమాతో నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నాను. ఈ సినిమా నాకు విఘ్నేశ్‌ను ఇచ్చింది’’ అనిపోస్ట్‌ చేశారు.

కాగా ‘నేనూ రౌడీనే’ సినిమా చిత్రీకరణ సమయంలోనే నయనతార, విఘ్నేశ్‌ల మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. 2021లో తమ ప్రేమను వెల్లడించిన వీరు 2022 జూన్‌ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరికీ ఉయిర్, ఉలగ్‌ అనే ట్విన్స్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement