
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతున్న కథానాయిక నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటున్న ఈ జంట ఏ ఆటంకం కలగకుండా పలు పూజలు చేస్తున్నారని భోగట్టా. ఇప్పటికే ఈ ఇద్దరూ తమిళనాడు, కేరళలోని పలు ఆలయాలను సందర్శించారని తెలుస్తోంది.
తాజాగా తమిళనాడులోని కుంభకోణం సమీపంలో గల తిరునాగేశ్వరం రాహు ఆలయాన్ని ఇద్దరూ సందర్శించనున్నారట. అక్కడ ప్రత్యేక పూజలు, ప్రమాణాలు చేయనున్నారట నయనతార, విఘ్నేష్. మరి.. పెళ్లి పీటల మీద ఎప్పుడు కూర్చుంటారనేది తెలియాల్సి ఉంది. ప్రచారంలో ఉన్న వార్తల సారాంశం ఏంటంటే... ఇప్పటికే ఈ ప్రేమికులు పలు దేశాలు చుట్టారు. అందుకని పెళ్లి తర్వాత ప్రత్యేకంగా హనీమూన్ ప్లాన్ చేయడంలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment