Tamilnadu govt
-
నయన్ దంపతుల సరోగసిపై ప్రభుత్వం ఏం తేల్చనుంది?
స్టార్ హీరోయిన్ నయనతార దంపతుల సరోగసి వివాదంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ పూర్తి చేసింది. రేపు(బుధవారం) తమిళనాడు సర్కారుకు కమిటీ సభ్యులు నివేదిక అందించనున్నారు. కాగా లేడీ సూపర్‌స్టార్ నయనతారదంపతుల సరోగసి వివాదం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. సరోగసి విధానంలో నిబంధనలు పాటించలేదంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంగళరం ఈ విచారణ పూర్తయింది. ఈ క్రమంలో నయన్ దంపతలు కమిటీకి అపిడవిట్ పంపారు. తమకు ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ అయ్యిందని తెలిపారు. గతేడాది డిసెంబర్లోనే సరోగసి కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఇందులో నిబంధనలు అతిక్రమించలేదని పేర్కొన్నారు. ఈ వివాదంపై విచారణ పూర్తిచేసిన కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందిచనున్న నేపథ్యంలో నివేదికలో ఏం ఉండనున్నదనే దానిపై సస్పెన్స్ నెలకొంది. -
కియాపై కీలక ప్రకటన..
సాక్షి, అమరావతి: తమ అనంతపురం ప్లాంటు వేరే ప్రాంతానికి తరలి వెళుతోందంటూ వచ్చిన వార్తలో నిజం లేదంటూ కియా మోటర్స్ స్పష్టం చేసింది. తప్పుడు కథనాలను పట్టించుకోవద్దని సూచించింది. సమర్థుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని వెల్లడించింది. దీర్ఘకాలిక లక్ష్యంతో అనంతపురంలో 1.1 బిలియన్ డాలర్లతో యూనిట్‌ను ఏర్పాటు చేశామని, ఇక్కడి నుంచే ప్రపంచస్థాయి కార్లను తయారుచేసి వినియోగదారులకు అందిస్తామని తెలిపింది. ఈ మేరకు కియా మోటర్స్ ఎండీ కుక్యున్ షిమ్ లేఖ రాశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఆటోఎక్స్పోలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో కలసి కియా ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కియా ఎండీ కుక్యున్ షిమ్ రాసిన లేఖను కియా ప్రతినిధులు చదివి వినిపించారు. ఈ సందర్భంగా కియా జనరల్ మేనేజర్ సన్ ఊక్ వాంగ్ మాట్లాడుతూ.. కియా సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉన్న బంధం చెక్కు చెదరదని, కలసిమెలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రాయిటర్స్ రాసిన తప్పుడు కథనంపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. కియా మోటార్స్ ఎక్కడికీ వెళ్లదని, రానున్న కాలంలో మరిన్ని ఆటో మొబైల్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. తమ ప్రభుత్వ సహకారంతోనే కియా మోటార్స్ రెండో మోడల్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని చెప్పారు. కియో మోటార్స్, తమిళనాడు ప్రభుత్వం కూడా అసత్య ప్రచారాన్ని ఖండించిందని, అయినా కొందరు కావాలనే స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కియాపై బాధ్యతరాహిత్యంతో ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరణ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇంత దుష్ప్రచారాలకు తెరతీయడం రాజకీయంగా దిగజారడమేనన్నారు. (చదవండి: రాయిటర్స్‌కు బాబు సర్కారు పందేరం) -
విచారణ కమిషన్ ముందుకు మాజీ సీఎస్
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు హాజరయ్యారు. జయలలిత సీఎంగా ఉన్న కాలంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గురువారం కమిషన్ కార్యాలయానికి వచ్చి కమిషన్ చైర్మన్ ముందు హాజరయ్యారు. స్పృహలో ఉన్న స్థితిలోనే జయ ఆస్పత్రికి వచ్చారా? అడ్మిట్ చేయడానికి అసలుకారణాలేంటి? చికిత్సకు సంబంధించి తప్పుల తడకలుగా బులెటిన్లు ఎందుకు విడుదల చేశారు? తదితర ప్రశ్నలు వేసినట్లు సమాచారం. -
లవర్స్ కోసం స్పెషల్ టోల్ ఫ్రీ నంబర్
సాక్షి, చెన్నై: ప్రేమ, కులాంతర వివాహాలు చేసుకునే వారికి భరోసా ఇస్తూ తమిళనాడులోని మధురైలో ప్రత్యేక విభాగం ఆవిర్భవించింది. మధురై కోర్టు ఆదేశాల మేరకు క్రైం ప్రివెన్షల్ సెల్(సీపీసీ)గా ఈ విభాగం ఏర్పాటు అయింది. మూడు విభాగాల సమన్వయంతో రూపుదిద్దుకున్న ఈ విభాగానికి ప్రత్యేక అధికారిని నియమించారు. అలాగే, ప్రేమికుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రకటించారు. ఇటీవల తమిళనాడులో కులాంతర ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారి తీస్తున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో అధికారికంగా వంద మంది వరకు పరువు హత్యలకు గురైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అనధికారికంగా ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయని అంచనా. ప్రధానంగా దక్షిణ, పశ్చిమ తమిళనాడులో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. పరువు కోసం తమ కుమార్తెలను చంపడమో, లేకపోతే తాము చావడమో చేస్తున్నారు. గత ఏడాది తిరుప్పూర్‌లో నడీ రోడ్డు మీద శంకర్ అనే యువకుడిని అతి కిరాతకంగా హతమార్చిన వీడియో బయటకు రావడంతో మద్రాస్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే దంపతులకు తాము అండగా ఉంటామన్నట్టుగా హైకోర్టు భరోసా ఇచ్చింది. అయినా, పరువుహత్యలు ఆగకపోవడంతో కోర్టు కన్నెర్ర చేసింది. పరువు హత్యల కట్టడి లక్ష్యంగా ప్రత్యేక చట్టం తీసుకు రావడంతో పాటుగా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఇందుకు గాను ప్రత్యేక నిధిని, ప్రత్యేక విభాగం ఏర్పాటుకు కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నెలాఖరులో కోర్టు తీర్పు వెలువడ్డ తర్వాత కూడా ఆదివారం సేలం ఆత్తూరులో తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందన్న వేదనతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కోర్టు తీర్పులో తొలి అడుగుగా దక్షిణ తమిళనాడుకు కేంద్రంగా ఉన్న మధురైలో సీపీసీ ఆవిర్భవించడం విశేషం. ప్రత్యేక వింగ్‌తో భరోసా : మదురై జిల్లా పోలీసు యంత్రాంగం, నగర పోలీసు కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రేమికులకు భరోసా ఇస్తూ ప్రత్యేక వింగ్, క్రైం ప్రివెన్షన్ సెల్ (సీపీసీ)ను సోమవారం ఏర్పాటు చేశారు. పోలీసు, సాంఘిక సంక్షేమ శాఖ, ఆది ద్రావిడ సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలో ఈవిభాగం పనిచేస్తుంది. అళగర్ ఆలయ మెయిన్ రోడ్డులోని కమిషనరేట్ ఆవరణలో ఈ విభాగం కోసం ప్రత్యేక వసతులతో విశాలమైన గదిని కేటాయించారు. ఇక్కడికి వచ్చే ఫిర్యాదుల మేరకు తక్షణం ఈ విభాగం స్పందిస్తుంది. ప్రేమికులకు భద్రత కల్పించడం, తల్లిదండ్రుల్ని పిలిపించి చర్చలు జరపడంతో పాటుగా కౌన్సిలింగ్ తదితర వ్యవహారాలు, కేసుల నమోదు మీద ఈ విభాగం ప్రాథమికంగా దృష్టి పెట్టనుంది. ఈ విభాగం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరును ప్రకటించారు. ఆ మేరకు 0452–2346302 నంబరును సంప్రదించాలని సూచించారు. దశల వారీగా ఈ విభాగాల్ని ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు కాబోతున్నాయి. -
తమిళనాడు ప్రభుత్వంపై యార్లగడ్డ ఫైర్
న్యూఢిల్లీ : తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని హిందీ భాష సంఘం సభ్యుడు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆరోపించారు. గురువారం న్యూఢిల్లీలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ... 2006 తమిళ భాషా చట్టాన్ని రద్దు చేస్తామన్న పార్టీలకే ఓటేయ్యాలని తమిళ ఓటర్లకు ఆయన సూచించారు. తమిళ భాషా చట్టం రద్దుపై త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ ఏడాది మాతృ భాషలోనే పరీక్ష రాసుకునే అవకాశం కల్పిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించడంపై లక్ష్మీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. -
మీకు మేం అండగా ఉంటాం: వైఎస్ జగన్
వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ సాక్షి, హైదరాబాద్: చెన్నైలో వర్షాలు, వరద ముంపుతో విలవిల్లాడుతున్న ప్రజలను ప్రభుత్వాలు, తోటి మానవులు ఇతోధికంగా ఆదుకోవాలని, వారికి సాధ్యమైనంత మేరకు సహాయం అందించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రకృతి సృష్టించిన వరద బీభత్సాన్ని చెన్నైవాసులు మనో నిబ్బరంతో ఎదుర్కొంటున్న తీరు ఆదర్శనీయమని, ఈ క్లిష్ట సమయంలో వారికి తమ సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. -
ఎన్కౌంటర్ మృతులకు రూ. 3లక్షల పరిహారం
తమిళనాడు/చిత్తూరు: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన కూలీలకు ఒక్కొక్కరికి రూ. 3లక్షల చొప్పున నష్టపరిహారాన్ని తమిళనాడు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూలీల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మద్రాస్ హైకోర్టు లాయర్లు బుధవారం నిరసకు దిగారు. ఎన్కౌంటర్ పేరుతో కూలీలను కాల్చిచంపినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరసనగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు.