న్యూఢిల్లీ : తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని హిందీ భాష సంఘం సభ్యుడు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆరోపించారు. గురువారం న్యూఢిల్లీలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ... 2006 తమిళ భాషా చట్టాన్ని రద్దు చేస్తామన్న పార్టీలకే ఓటేయ్యాలని తమిళ ఓటర్లకు ఆయన సూచించారు.
తమిళ భాషా చట్టం రద్దుపై త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ ఏడాది మాతృ భాషలోనే పరీక్ష రాసుకునే అవకాశం కల్పిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించడంపై లక్ష్మీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.