
'ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది'
విశాఖపట్నం: శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు వర్శిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ సిబ్బందికి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మండిపడ్డారు. శుక్రవారం విశాఖపట్నంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ... ఈ రెండు యూనివర్శిటీల సిబ్బందికి గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు.
15 రోజుల్లో జీతాలు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెంటనే స్పందించాలని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు.