తల్లిదండ్రులైన మరుసటి రోజే సౌత్ స్టార్ కపుల్ నయనతార-విఘ్నేశ్ శివన్ దంపతులకు షాక్ తగిలింది. ఈ ఏడాది జూన్ 9న పెళ్లి పీటలు ఎక్కిన నయన్-విఘ్నేశ్‌లు ఐదు నెలల తిరక్కుండానే తల్లిదండ్రులు అయ్యారు. తాము కవలలకు తల్లిదండ్రులమయ్యామంటూ నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ సోషల్ మీడియా వేదికగా ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
చదవండి: నయన్‌ను టార్గెట్ చేసిన నటి, నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్
ఈ సందర్భంగా వారిద్దరు చిన్నారుల పాదాలను ముద్దాడుతున్న ఫొటోలను షేర్ చేస్తూ మురిసిపోయాడు విఘ్నేశ్. దీంతో సరోగసి(అద్దే గర్భం ద్వారా పిల్లలను కనడం) ద్వారానే నయన్-విఘ్నేశ్ తల్లిదండ్రులు అయ్యారనే వాదన వినిపిస్తోంది. ఈ తరుణంలో సీనియర్ నటి కస్తూరి సరోగసి ద్వారా నయన్ తల్లి కావడంపై పరోక్షంగా స్పందించింది. సరోగసీని దేశంలో నిషేధించారని, ఈ ఏడాది దీనిపై ఉత్తర్వులు కూడా వచ్చాయంటూ ఆమె ట్వీట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది.
చదవండి: వివాదంలో నాగచైతన్య మూవీ! చిత్ర బృందంపై గ్రామస్తుల దాడి?
నటి కస్తూరితోపాటు చాలామంది అదే అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నయన్ దంపతులు వ్యవహరించారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్‌కు తెరలేపారు. ఇవన్నీ చూస్తుంటే.. నయన్ దంపతులు వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారు తల్లిదండ్రులు అయిన తీరుపై తాజాగా తమిళనాడు ప్రభుత్వం స్పందిందించింది. ఈ మేరకు సరోగసీపై నయనతార-విఘ్నేశ్ శివన్‌లు ప్రభుత్వానికి వివరాలు అందజేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ పేర్కొన్నారు. అంతేకాదు సరోగసీ ప్రక్రియ సక్రమంగా జరిగిందా? లేదా? అన్న దానిపై కూడా నయన్ దంపతులను ఆరా తీస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment