నయనతార కవలలకు జన్మనినిచ్చిని విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే అదే ఇప్పుడు వివాదంగా మారింది. పిల్లలు ఏ విధంగా పుట్టారన్న దానిపై నయన్ దంపతులు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వివాదం కొనసాగుతోంది. దీంతో సరోగసి ద్వారానే పిల్లలు జన్మించినట్లు అందరూ భావిస్తున్నారు. మరి మనదేశంలో సరోగసికి ఉన్న నిబంధనలేంటి? మన దేశంలో చట్టం ఏం చెబుతోంది? ఒకసారి పరిశీలిద్దాం.
మనదేశంలో సరోగసి చట్టం ప్రకారం పెళ్లయిన ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యాక పిల్లలు పుట్టకపోతే ఈ పద్ధతిని ఎంచుకోవచ్చు. ఒకవేళ చట్టంలోని నిబంధనలు అతిక్రమించినట్లు రుజువైతే పదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. అయితే నయన్-విఘ్నేశ్ దంపతులు దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో కవలలు పుట్టిన విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పిల్లలు ఎలా జన్మించారో వివరణ ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment