surrogate baby
-
నయన్-విఘ్నేశ్ చట్టాన్ని అతిక్రమిస్తే.. శిక్షేంటో తెలుసా?
నయనతార కవలలకు జన్మనినిచ్చిని విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే అదే ఇప్పుడు వివాదంగా మారింది. పిల్లలు ఏ విధంగా పుట్టారన్న దానిపై నయన్ దంపతులు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వివాదం కొనసాగుతోంది. దీంతో సరోగసి ద్వారానే పిల్లలు జన్మించినట్లు అందరూ భావిస్తున్నారు. మరి మనదేశంలో సరోగసికి ఉన్న నిబంధనలేంటి? మన దేశంలో చట్టం ఏం చెబుతోంది? ఒకసారి పరిశీలిద్దాం. మనదేశంలో సరోగసి చట్టం ప్రకారం పెళ్లయిన ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యాక పిల్లలు పుట్టకపోతే ఈ పద్ధతిని ఎంచుకోవచ్చు. ఒకవేళ చట్టంలోని నిబంధనలు అతిక్రమించినట్లు రుజువైతే పదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. అయితే నయన్-విఘ్నేశ్ దంపతులు దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో కవలలు పుట్టిన విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పిల్లలు ఎలా జన్మించారో వివరణ ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
విడాకులైన ఐదేళ్లకు బిడ్డా!.. ఎవరితో కన్నావ్?
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జనాలకు.. ముఖ్యంగా ఫ్యాన్స్‌కు ఎక్కడా లేని ఆసక్తి. అయితే సంక్లిష్టమైన అంశాల జోలికి పోయినప్పుడు.. వాళ్లను వివాదాల్లోకి లాగడం తరచూ చూస్తుంటాం. అక్వామ్యాన్ ఫేమ్ హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఐదేళ్ల కిందట నటుడు జానీ డెప్ నుంచి విడాకులు తీసుకున్న అంబర్.. ఆ తర్వాత ఏడాదిపాటు టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌తో డేటింగ్ చేసింది. ఆ బ్రేకప్ తర్వాత నుంచి సోలోగానే ఉంటున్న అంబర్.. సరోగసీ ద్వారా ఆమె బిడ్డను కనడం హాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్‌లో తాను సరోగసీ ద్వారా బిడ్డను కన్నానని, ఆ బిడ్డ పేరు ఉనగ్ పైగె హెర్డ్ అని తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించుకుంది అంబర్ హెర్డ్. ఒళ్లో బిడ్డను పడుకోబెట్టుకున్న ఫొటోను ఆమె షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు తెలిపారు. అయితే.. ఆమె పోస్ట్‌ను పూర్తిగా చదవకుండా.. అర్థం చేసుకోని కొందరు.. ఆమె క్యారెక్టర్‌ను తప్పుబడుతూ కామెంట్లు చేశాడు. ‘ఎవరితో ఆ బిడ్డను కన్నావ్.. సిగ్గు లేదా?’ అంటూ విరుచుకుపడ్డారు. రహస్యంగా బిడ్డను కన్నావా? ఈసారి ఎవరి జీవితాన్ని నాశనం చేస్తావ్? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పనిలో పనిగా ఆమె మీద గుస్సాగా ఉన్న జానీ డెప్ ఫ్యాన్స్.. ఈ వ్యవహారాన్ని మరింత ముదిరేలా చేశారు. అయితే ఆ విమర్శలకు ఆమె శాంతంగానే స్పందిస్తూ.. ఘాటు రిప్లై ఇచ్చింది. ‘నాలుగేళ్ల క్రితమే బిడ్డను కనాలనుకున్నా. ఇప్పటికీ నా కల నెరవేరింది. అయినా నా వ్యక్తిగత జీవితం నా ఇష్టం. నేను ఎవరితో బిడ్డను కంటే మీకేం నొప్పి. సరోగసీ అనేది మీలాంటి వాళ్లకు అర్థం కానీ విషయం. అది అర్థమై ఉంటే మీరు మూర్ఖంగా ఎందుకు మాట్లాడతారు’ అని ఓ మీడియా ఛానెల్ ద్వారా విమర్శకులకు బదులిచ్చింది 35 ఏళ్ల అంబర్ లారా హెర్డ్. కాగా, హాలీవుడ్లో టైరా బ్యాంక్స్, జెమ్మీ ఫాలోన్, సారా జెస్సికా పార్కర్, ఎల్టోన్ జాన్.. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు సరోగసీ ద్వారా బిడ్డల్ని కన్నారు. బాలీవుడ్, అంతెందుకు టాలీవుడ్‌లోనూ సరోగసీ ద్వారా బిడ్డల్ని కన్నవాళ్లు ఉన్నారు. వైవాహిక బంధం, కాపురాలపై అయిష్టత ఉన్న వాళ్లు ఎక్కువగా సరోగసీని ఆశ్రయిస్తుంటారు. View this post on Instagram A post shared by Amber Heard (@amberheard) చదవండి: సినిమాటోగ్రఫీ చట్టం సవరణలపై నిరసనలు -
గే తమ్ముడి దంపతుల బిడ్డకు జన్మనిచ్చిన అక్క
మాంచెస్టర్ : అక్క అన్న పదానికి, అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందో మహిళ. గే తమ్ముడి కోరికను నెరవేర్చడానికి ఏ అక్కా చేయని పనికి పూనుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన గే దంపతులు ఆంథోనీ బీగన్, రే విలియమ్స్ ఎంతోకాలంగా ఓ బిడ్డ కావాలనుకుంటున్నారు. సరోగసీ పద్దతి ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఓ మహిళను అన్వేషించసాగారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించకపోవటంతో తీవ్ర నిరాసకు గురయ్యారు. అలాంటి సమయంలో ఆంథోనీ డీగన్ అక్క ట్రేసీ హల్స్ ఓ దేవతలా వారికి సహాయం చేయటానికి ముందుకు వచ్చింది. అయితే ఆమె వయసు 40 ఏళ్లు పైబడి ఉండటంతో భర్త అభ్యంతరం తెలిపాడు. కానీ, ట్రేసీ వెనకడుగు వేయలేదు. గే దంపతులు సరోగసి కోసం దాదాపు 36 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇద్దరూ తమ వీర్యాన్ని దానం చేశారు. ఆమె గే దంపతుల మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డకు బయోలాజికల్ తండ్రి ఎవరన్న దాన్ని తెలుసుకోవటానికి గే దంపతులు ఇష్టపడలేదు. దీనిపై ఆంథోనీ మాట్లాడుతూ.. ‘‘ పదిహేడేళ్ల తర్వాత ట్రేసీ మమ్మల్ని మా కుమారుడికి పరిచయం చేస్తుంది. ఆ క్షణం మాకు ఎంతో ప్రత్యేకం. ఆమె మాకోసం చేసిన పని వెలకట్టలేనిది’’ అని అన్నాడు. చదవండి : ‘ఆ హెయిర్ కట్ చాలా దారుణంగా ఉంటుంది’ ఫ్రాంక్‌తో తల్లిని హడలుగొట్టిన కుమారులు -
ఆ బిడ్డ... ఆ దంపతులకు పుట్టిందే!
♦ డీఎన్ఏ టెస్టుతో నిర్ధారణ హైదరాబాద్: పేట్లబురుజు ఆస్పత్రిలో ఇటీవల జన్మించిన సరోగసి శిశువు కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. సదరు పసికందు సరోగసీ ద్వారా జన్మించింది కాదని స్పష్టమైంది. ఆ బిడ్డ బాధితురాలు సుధారాణి అలియాస్ వెంకటమ్మ దంపతులకు జన్మించిన బిడ్డగా నిర్ధారణైంది. మహబూబ్‌నగర్‌కు చెందిన లక్ష్మణ్ భార్య వెంకటమ్మ గర్భం దాల్చింది. నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఆమెను భర్త లక్ష్మణ్ హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించాడు. కేస్ షీట్లో పేరు నమోదు చేసే సమయంలో భర్త ఒక పేరు..భార్య మరో పేరు చెప్పడంతో అనుమానం వచ్చిన వైద్యులు ఆరా తీయగా తన కడుపులో ఉన్నది సరోగసీ బిడ్డ అని, ఆడబిడ్డ అని తెలిసి సరోగసికి కారణమైన గుంటూరు దంపతులు ముఖం చాటేశారని తెలిపింది. దీంతో వైద్యులు జిల్లా వైద్యాధికారిణి పద్మజ సహా చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా వైద్యాధికారులు రంగంలోకి దిగి బాధిత దంపతుల నుంచే కాకుండా గుంటూరు దంపతుల నుంచి నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షకు పంపారు. బిడ్డ బాధితురాలు వెంకటమ్మ దంపతుల జన్యువుతో పోలికలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. సరోగసీ కేసులో విచారణ కొనసాగుతోందని, సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం చట్టపరిధిలో తగిన చర్యలు తీసుకుంటామని చార్మినార్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.