ఆంథోనీ, ట్రేసీ, రే విలియమ్స్
మాంచెస్టర్ : అక్క అన్న పదానికి, అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందో మహిళ. గే తమ్ముడి కోరికను నెరవేర్చడానికి ఏ అక్కా చేయని పనికి పూనుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన గే దంపతులు ఆంథోనీ బీగన్, రే విలియమ్స్ ఎంతోకాలంగా ఓ బిడ్డ కావాలనుకుంటున్నారు. సరోగసీ పద్దతి ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఓ మహిళను అన్వేషించసాగారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించకపోవటంతో తీవ్ర నిరాసకు గురయ్యారు. అలాంటి సమయంలో ఆంథోనీ డీగన్ అక్క ట్రేసీ హల్స్ ఓ దేవతలా వారికి సహాయం చేయటానికి ముందుకు వచ్చింది.
అయితే ఆమె వయసు 40 ఏళ్లు పైబడి ఉండటంతో భర్త అభ్యంతరం తెలిపాడు. కానీ, ట్రేసీ వెనకడుగు వేయలేదు. గే దంపతులు సరోగసి కోసం దాదాపు 36 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇద్దరూ తమ వీర్యాన్ని దానం చేశారు. ఆమె గే దంపతుల మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డకు బయోలాజికల్ తండ్రి ఎవరన్న దాన్ని తెలుసుకోవటానికి గే దంపతులు ఇష్టపడలేదు. దీనిపై ఆంథోనీ మాట్లాడుతూ.. ‘‘ పదిహేడేళ్ల తర్వాత ట్రేసీ మమ్మల్ని మా కుమారుడికి పరిచయం చేస్తుంది. ఆ క్షణం మాకు ఎంతో ప్రత్యేకం. ఆమె మాకోసం చేసిన పని వెలకట్టలేనిది’’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment