surrogate child
-
నయన్-విఘ్నేశ్ చట్టాన్ని అతిక్రమిస్తే.. శిక్షేంటో తెలుసా?
నయనతార కవలలకు జన్మనినిచ్చిని విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే అదే ఇప్పుడు వివాదంగా మారింది. పిల్లలు ఏ విధంగా పుట్టారన్న దానిపై నయన్ దంపతులు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వివాదం కొనసాగుతోంది. దీంతో సరోగసి ద్వారానే పిల్లలు జన్మించినట్లు అందరూ భావిస్తున్నారు. మరి మనదేశంలో సరోగసికి ఉన్న నిబంధనలేంటి? మన దేశంలో చట్టం ఏం చెబుతోంది? ఒకసారి పరిశీలిద్దాం. మనదేశంలో సరోగసి చట్టం ప్రకారం పెళ్లయిన ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యాక పిల్లలు పుట్టకపోతే ఈ పద్ధతిని ఎంచుకోవచ్చు. ఒకవేళ చట్టంలోని నిబంధనలు అతిక్రమించినట్లు రుజువైతే పదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. అయితే నయన్-విఘ్నేశ్ దంపతులు దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో కవలలు పుట్టిన విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పిల్లలు ఎలా జన్మించారో వివరణ ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
షారూక్‌పై కేసు విచారణ 26కు వాయిదా
ముంబై : అద్దె గర్భం ద్వారా కుమారుడిని పొందిన నటుడు షారూఖ్‌ఖాన్, అంతకు ముందు చట్టానికి వ్యతిరేకంగా లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త వర్ష దేశ్‌పాండే వేసిన కేసును బాంబే హైకోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది. అంతకు ముందు తమ ముందుకు వచ్చిన కేసుపై న్యాయమూర్తి మాట్లాడుతూ ‘అతడు ముందస్తు లింగనిర్ధారణ పరీక్షలు జరిపించారని ఎలా ఆరోపిస్తున్నారు.. బిడ్డ పుట్టకముందే పరీక్షలు చేయించాడా.. నివేదిక ఎప్పుడు ఇచ్చారు..అంటూ వర్షాను ప్రశ్నించారు. తదుపరి విచారణను ఆగస్టు 26కు వాయిదా వేస్తూ, అప్పటిలోగా అన్ని రికార్డులను కోర్టుకు అందజేయాలని ఆదేశించారు. -
షారుక్, గౌరీ ఖాన్‌లపై కోర్టులో కేసు దాఖలు
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇటీవల అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందిన విషయం తెలుసు కదూ. అయితే, ఆ బిడ్డ ఆడా.. మగా అన్న విషయాన్ని తెలుసుకోడానికి ముందుగానే లింగనిర్ధారణ పరీక్షలు చేయించారంటూ షారుక్‌ఖాన్, ఆయన భార్య గౌరి, ఇతరులపై కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. వర్షా దేశ్‌పాండే అనే మహిళా న్యాయవాది ఈ కేసు దాఖలు చేశారు. ఇటీవలే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో షారుక్ దంపతులు అద్దె గర్భం ద్వారా మూడో సంతానాన్ని పొందారు. కానీ వీళ్లు ముందుగానే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారంటూ దేశ్‌పాండే ఫిర్యాదు చేశారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో తాను ముందు బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. దీంతో కార్పొరేషన్ అధికారులు జూన్ 17న వాస్తవాలు తెలుసుకోడానికి షారుక్ ఇంటికి వెళ్లినా, ఆయన అవన్నీ పసలేని ఆరోపణలేనని ఖండించారని చెప్పారు. కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారని అన్నారు. ఈ కేసును సెప్టెంబర్ 12న విచారణకు స్వీకరిస్తూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఉదయ్ పడ్వాడ్ ఆదేశాలు జారీ చేశారు. షారుక్ దంపతులతో పాటు కార్పొరేషన్ ఆరోగ్యశాఖాధికారులకు కూడా నోటీసులు జారీ చేశారు.