షారూక్‌పై కేసు విచారణ 26కు వాయిదా | Shah Rukh Khan Surrogate child case: Trial postponed to August 26 | Sakshi
Sakshi News home page

షారూక్‌పై కేసు విచారణ 26కు వాయిదా

Published Thu, Aug 22 2013 10:56 PM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM

షారూక్‌పై కేసు విచారణ 26కు వాయిదా

షారూక్‌పై కేసు విచారణ 26కు వాయిదా

ముంబై : అద్దె గర్భం ద్వారా కుమారుడిని పొందిన నటుడు షారూఖ్‌ఖాన్, అంతకు ముందు చట్టానికి వ్యతిరేకంగా లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త వర్ష దేశ్‌పాండే వేసిన కేసును బాంబే హైకోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది.

అంతకు ముందు తమ ముందుకు వచ్చిన కేసుపై న్యాయమూర్తి మాట్లాడుతూ ‘అతడు ముందస్తు లింగనిర్ధారణ పరీక్షలు జరిపించారని ఎలా ఆరోపిస్తున్నారు.. బిడ్డ పుట్టకముందే పరీక్షలు చేయించాడా.. నివేదిక ఎప్పుడు ఇచ్చారు..అంటూ వర్షాను ప్రశ్నించారు. తదుపరి విచారణను ఆగస్టు 26కు వాయిదా వేస్తూ, అప్పటిలోగా అన్ని రికార్డులను కోర్టుకు అందజేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement