Priyanka Chopra and Nick Jonas Welcome Their First Baby Via Surrogacy: మొదటిసారి తల్లైన ప్రియాంక చోప్రా - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: స్వీట్‌ న్యూస్‌ చెప్పిన స్టార్‌ హీరోయిన్‌.. సరోగసి ద్వారా తల్లైన ప్రియాంక

Published Sat, Jan 22 2022 9:11 AM | Last Updated on Sat, Jan 22 2022 1:47 PM

Priyanka Chopra and Nick Jonas Welcome Their First Baby Via Surrogacy - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తల్లైంది. సరోగసి ద్వారా ప్రియాంక- నిక్‌ జోనస్‌ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించకండి. ధన్యవాదాలు..' అని రాసుకొచ్చింది.

ఈ విషయం తెలిసిన సెలబ్రిటీలు, అభిమానులు ప్రియాంక దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా నిక్‌, ప్రియాంక 2018 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. రాజస్తాన్‌లోని ఉమైద్‌ భవన్‌ రాజభవనంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. క్రిస్టియన్‌ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు.

సరోగసి ద్వారా తల్లైన హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఫొటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement