న్యూఢిల్లీ: కేంద్రం ఆమోదించిన సరోగసీ (అద్దెగర్భం) బిల్లు ముసాయిదాపై విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో అందులో సూచనలను చేర్చటానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పేర్కొంది. పిల్లలను వదిలిపెట్టటం, మహిళలను దోపిడీ చేయడం వంటి కీలక అంశాలపై మరో మాటకు అవకాశమే లేదని తేల్చిచెప్పింది. పౌరులపై నైతిక విలువలను రుద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలను కేంద్ర ఆరోగ్యమంత్రి నడ్డా తిరస్కరించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది ధర్మబద్ధతకు సంబంధించినదని ఈ రంగంలో సాంకేతిక పురోగతిని సరైన దృక్కోణంతో వినియోగించుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.