Nadda
-
బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు.. తెలంగాణపై నడ్డా కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపినడ్డా తెలంగాణ విషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలోని ప్రగతిమైదాన్ భారత్ మండపంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో నడ్డా ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణలో గతంలో 7 శాతం ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతానికి పెరిగిందని చెప్పారు. ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఐదేళ్లలో బలం పెంచుకుని తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో మూడోసారిఅధికారంలోకి రానున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గత పదేళ్లలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతినిధులకు నడ్డా వివరించారు. సమావేశాలకు ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదీ చదవండి.. ఇండియా కూటమి కథ ముగిసింది.. నితీశ్ కుమార్ -
లోక్‌సభ ఎన్నికలకు జేపీ నడ్డా దూరం?
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన తిరిగి రాజ్యసభ ఎంపీ అవుతారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. జీపీ నడ్డాను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపవచ్చని సమాచారం. జేపీ నడ్డా ఇటీవలే రాజ్యసభ పదవీకాలం పూర్తిచేసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. రాజ్యసభ ఎంపీలైన నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ పదవీకాలం మూడేళ్ల కంటే అధిక సమయం ఉంది. అందుకే వారికి లోక్‌సభ ఎన్నికలలో పోటీ నుండి మినహాయింపు ఉండవచ్చు. కాగా బీజేపీ నేతలు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, మురళీధరన్‌లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటానికి తోడు, అక్కడ బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో నడ్డా తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభకు వెళ్లే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ నుంచి జేపీ నడ్డా రాజ్యసభకు వెళ్లే అవకాశాలున్నాయనే మాట కూడా వినిపిస్తోంది. ఎన్నికల సంఘం ఇటీవల ఫిబ్రవరి 27న 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. -
2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీకి ఈ నెల 25న జరగనున్న ఎన్నికలకు బీజేపీ గురువారం మేనిఫోస్టోను విడుదల చేసింది. ఉజ్వల పథకం లబ్ధిదారులకిచ్చే వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.450 చొప్పున సబ్సిడీ, వచ్చే అయిదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పీఎం కిసాన్ యోజన కింద రైతులకిచ్చే ఆర్థిక సాయం పెంపు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ మేరకు మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను బీ జేపీ చీఫ్ జేపీ నడ్డా గురువారం జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రశ్నపత్రాల లీకేజీతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా ఈ సందర్భంగా నడ్డా ప్రకటించారు. సంకల్ప పత్రలోని మరికొన్ని హామీలు.. గోధుమలను కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు బోనస్‌తో కలిపి క్వింటాలుకు రూ.2,700 చొప్పున కొనుగోలు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం ఏడాదికి రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంపు. ఈస్టర్న్ రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టు(ఈఆర్సీపీ)ను కేంద్రం సాయంతో నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయడం. ఈ ప్రాజెక్టుతో 13 జిల్లాలకు తాగు, సాగునీటి సమస్య తీరుతుంది. మహిళలు, బాలికల కోసం... జిల్లాకో మహిళా పోలీస్ స్టేషన్. ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా డెస్క్..ప్రతి నగరంలో యాంటీ రోమియో స్క్వాడ్ల ఏర్పాటు. లాడో ప్రోత్సాహన్ యోజన కింద పుట్టిన ప్రతి బాలిక పేరిట రూ.2 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్. లక్పతి దీదీ పథకం ద్వారా ఆరు లక్షల మంది గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ. 12వ తరగతి పూర్తి చేసుకున్న ప్రతిభావంతులైన బాలికలకు స్కూటీల పంపిణీ. పేద కుటుంబాల బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. రాష్ట్రంలో మూడు మహిళా బెటాలియన్ల ఏర్పాటు. పీఎం మాతృ వందన్ పథకం కింద అందించే ఆర్థిక సాయం రూ.5 వేల నుంచి 8 వేలకు పెంపు. యువత కోసం.. వచ్చే అయిదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ పేద కుటుంబాల విద్యార్థులు పుస్తకాలు, దుస్తులు కొనుక్కునేందుకు ఏటా రూ.12 వేలు పంపిణీ. ప్రతి డివిజన్లో రాజస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు. ఆరోగ్యరంగంలో.. భామాషా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ద్వారా ఆరోగ్య రంగంపై రూ.40 వేల కోట్ల పెట్టుబడి కొత్తగా 15 వేల మంది వైద్యులు, 20 వేల పారామెడికల్ సిబ్బంది నియామకం. వీటితోపాటు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, జైపూర్ మెట్రో విస్తరణ, పారదర్శక బదిలీ విధానం, పేద కుటుంబాలకు ఉచిత రేషన్, దివ్యాంగులకు రూ.1,500 పింఛను, వృద్ధాప్య పింఛను పెంపు వంటివి ఉన్నాయి. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 350 బిలియన్ డాలర్లకు పెంచుతామని వాగ్దానం చేసింది. జైపూర్, ఉదయ్‌పూర్, కోటా, అజీ్మర్, జోథ్‌పూర్, బికనీర్‌లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడాన్ని కూడా మేనిఫెస్టో పేర్కొంది. ఓబీసీలకు నిర్ణిత వ్యవధిలో ధ్రువీకరణ పత్రాల జారీ, వారికి రూ.15 వరకు విద్యారుణం. ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు. ఇవి కాకుండా, ఎస్సీ,ఎస్టీలు, గిరిజనులు, వీధి వ్యాపారులు, గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. -
బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడూ ఒకటి కాబోవని చెప్పండి.. నడ్డా సీరియస్ క్లాస్
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్, బీజేపీ ఒకటి కాదనే ప్రచారాన్ని సమర్థవంతంగా గట్టిగా తిప్పికొట్టండి.. ఈ రెండు పార్టీలు ఎప్పుడూ ఒకటి కావు..కాబోవు అనే విషయాన్ని విడమర్చి చెప్పండి. బీఆర్ఎస్తో బీజేపీకి గతంలోనూ ఎలాంటి ఒప్పందాలు లేని విషయాన్ని, బీఆర్ఎస్ మన ప్రధాన శత్రువు అని చాటండి. గతంలో చోటుచేసుకున్న పరిణామాలను, బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి దాదాపు ఇరవై ఏళ్లుగా వివిధ సందర్భాల్లో కలిసి సాగుతున్న విషయాన్ని ఎండగట్టండి. ఎవరో ఏదో అంటున్నారని, బీజేపీపై దు్రష్పచారం చేస్తున్నారని మా దృష్టికి తీసుకొచ్చే ముందు క్షేత్రస్థాయిలో ఆ ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టండి. ప్రజలకు వాస్తవాలు వివరించి మద్దతు కూడగట్టండి. పార్టీ వ్యతిరేక ప్రచారాన్ని సమష్టిగా ఎదుర్కోండి..’అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర నేతలకు క్లాస్ తీసుకున్నారు. ‘ఎన్నికల సమరంలోకి దిగి అన్ని సవాళ్లను ఎదుర్కోండి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఉమ్మడిగా కృషి చేయండి. ఏ సమస్యలున్నా మీకు అండగా నిలుస్తాం. పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. మీరంతా సీనియర్ నేతలు. రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలో మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేలా కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకు సాగండి..’అని చెప్పారు. నగరంలోని నోవాటెల్ హోటల్లో ఆదివారం రాత్రి పొద్దు పోయేదాకా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో నడ్డా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకరరెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యులు విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు పాల్గొన్నారు. లీకులిస్తే ఉపేక్షించేది లేదు.. వివిధ స్థాయిల్లోని నేతలు గత కొంతకాలంగా మీడియా చిట్‌చాట్‌ల పేరిట, లీకులతో జరిపిన వ్యవహారం పార్టీకి నష్టం చేసిందని, ఇకపై ఎవరూ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పొడొద్దని నడ్డా హెచ్చరించినట్టు సమాచారం. ‘పార్టీ క్రమశిక్షణను ఎవరూ ఉల్లంఘించకూడదు. ఇదే పద్ధతి కొనసాగిస్తే కఠిన చర్యలు ఉంటాయ్’అని అన్నట్టు తెలిసింది. కర్ణాటకలో పార్టీకి ప్రజల్లో మద్దతున్నా, పార్టీ నాయకులు, ముఖ్యనేతల మధ్య సమన్వయం లేకపోవడం, విభేదాలు రోడ్డెక్కడంతో ప్రజల తిరస్కారానికి గురికావాల్సి వచ్చిందని వివరించినట్టు తెలిసింది. తెలంగాణలో కర్ణాటక పరిస్థితి ఎదురుకాకుండా పార్టీ నేతలంతా సమన్వయంతో కలిసికట్టుగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేసినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ‘పార్టీ లైన్ దాటొద్దు..నోరు జారొద్దు..క్రమశిక్షణను ఉల్లంఘించొద్దు...పార్టీ కేడర్‌లో విశ్వాసం, నమ్మకం నింపండి. పూర్తి విశ్వాసంతో ముందుకు సాగండి..’అని సూచించినట్లు వెల్లడించాయి. రాత్రి నోవాటెల్‌లోనే బసచేసిన నడ్డా, సోమవారం ఉదయం ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వంద రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. -
కంగనా పొలిటికల్ ఎంట్రీపై నడ్డా కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రజలు కోరుకుంటే, బీజేపీ అవకాశం ఇస్తే తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన మదిలోని మాటలను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. ఆమె బీజేపీలో చేరాలనుకుంటున్న అంశంపై తాజాగా స్పందించారు కాషాయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా. కంగనా రనౌత్ బీజేపీలో చేరాలనుకోవటాన్ని స్వాగతిస్తున్నామని కానీ, ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై వివిధ దశల్లో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ విషయంపై ప్రశ్నించగా ఈ మేరకు పేర్కొన్నారు నడ్డా. ‘కంగనా రనౌత్ పార్టీలో చేరాలనుకుంటే స్వాగతిస్తాం. పార్టీతో కలిసి పని చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ స్థానం ఉంది. ఎన్నికల్లో పోటీ విషయానికి వస్తే, అది నేను ఒక్కడినే తీసుకునే నిర్ణయం కాదు. అది క్షేత్రస్థాయి నుంచి ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డు వరకు వివిధ దశల్లో విస్తృత చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. బీజేపీలో చేరాలనుకునే ఎవరినైనా స్వాగతిస్తాం. అయితే, వారి స్థానంపై పార్టీ నిర్ణయిస్తుంది. మేము షరుతుల ఆధారంగా ఎవరినీ పార్టీలో చేర్చుకోము. ఎలాంటి షరతులు లేకుండా రావాలని ప్రతిఒక్కరికి తెలియజేస్తున్నా. అప్పుడే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.’ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. మరోవైపు.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తాము కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నామని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మళ్లీ బీజేపీకే ఓటు వేస్తారని చెప్పారు. ప్రస్తుతం హిమాచల్‌లో బీజేపీ అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12న ఒకే దశలో జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఇదీ చదవండి: పొలిటికల్ ఎంట్రీపై కంగనా కామెంట్స్.. ‘బీజేపీ టికెట్ ఇస్తే అక్కడ పోటీ చేస్తా’ -
మోదీకి ఘనస్వాగతం పలికిన బీజేపీ అధ్యక్షుడు నడ్డా
-
పంజాబ్ సర్కార్ పై బీజేపి చీఫ్ జెపి నడ్డా ఫైర్..
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌లో నెలకు పైగా రైలు సర్వీసులు నిలిచిపోవడానికి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగే కారణమంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు మిస్టర్ సింగ్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందన్నారు. నా దృష్టి లో పంజాబ్ లో ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడానికి మీరు పూర్తిగా బాధ్యత వహిస్తారు అని బహిరంగ లేఖలో రాశారు. అమరీందర్ సింగ్ ఇంకా తన లేఖను స్వీకరించలేదని ఆయన అన్నారు. గూడ్స్ రైళ్లను నిలిపివేయడం పై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆదివారం అమరీందర్ సింగ్ జేపీ నడ్డాకు బహిరంగ లేఖ రాశారు. ఇది రాష్ట్రానికి సరఫరా తగ్గి పోవడానికి దోహద పడుతుందని రాష్ట్రంలో ఇప్పటికే బొగ్గు సరఫరా తక్కువగా వుంది. ఇది ఒక సంక్షోభానికి దారి తీస్తుంది.ఎరువులు,అవసరమైన వస్తువులు కోసం రైతులు ఆందోళన చెందుతున్నారుని లేఖలో రాశారు. దానికి బదులుగా భారత ప్రభుత్వం పంజాబ్‌లో రైళ్లు నడపడానకి చాలా ఆసక్తిగా వుంది కాని మీరు మీ ప్రభుత్వం రాష్ట్ర్రంలో ఆశించిన పాత్రను ప్రదర్శంచడం లేదని నడ్డా తిరిగి లేఖ రాశారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని పరిమితులను దాటి" ఆందోళనలను మిస్టర్ సింగ్ మరియు కాంగ్రెస్ బహిరంగంగా ప్రోత్సహించాయి అని అన్నారు. పంజాబ్ ప్రభుత్వం ఆందోళనకారుల పైన ఎటువంటి చర్యలు తీసుకోమని బహిరంగ ప్రకటన చేసిందని అందువల్ల ఆందోళనకారులు రోడ్డు ధర్నాలు, రైల్వే ట్రాక్‌లు పై ధర్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులుంటే బీజేపీకి ఎంతో గౌరవంని, వారి అభివృద్ది కోసం పార్టీ, ప్రభుత్వం ఎల్లప్పడూ సానుకూలమైన చర్యలు తీసుకుంటుందని రాశారు. చైనా, పాకిస్తాన్ రెండింటి నుంచి పెరుగుతున్న దూకుడు చర్యల మధ్య సాయుధ దళాలు అవసరమైన సామాగ్రిని కోల్పోతే పరిస్థితి దేశానికి చాలా ప్రమాదకరంగా మారుతుందనిఆయన లేఖ రాశారు. ఢిల్లీలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గోన్నఅమరీందర్ సింగ్ కేంద్రం ఆర్థిక దిగ్బంధనం లాంటి పరిస్థితిని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. -
వారంతా ఒకపూట భోజనాన్ని త్యాగం చేయండి: నడ్డా
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న చర్యలను అందరూ అభినందిస్తున్నారని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు. ఈ విపత్కర పరిస్థితులను మోదీ ఎలా ఎదుర్కుంటారు అని ప్రపంచం మొత్తం ఆయన వైపు చూస్తోందని పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి బీజీపీ కార్యకర్త 40 మందిని కలిసి ఒక్కొక్కరు రూ. 100 చొప్పున పీఎం కేర్స్ ఫండ్‌కి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాలని కోరారు. ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులు, డాక్టర్లు, నర్స్‌లు, బ్యాంక్ ఉద్యోగులు, పోస్ట్మ్యాన్లకు మనమందరం కృతజ్ఞతలు తెలిపాలన్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సంఘీభావంగా ఒకపూట భోజనాన్నిత్యజించాలని నడ్డా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ కూడా పార్టీ వ్యవస్థపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు ట్వీట్టర్ వేదిక తన సందేశాన్ని అందించారు. (కరోనాను తరిమికొడదాం: మోదీ పిలుపు) అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కేవలం 40 సంవత్సరాల్లోనే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి భారతీయ జనతా పార్టీ బలమైన స్తంభంలా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజల నమ్మకాన్ని బీజేపీ చూరగొందని పేర్కొన్నారు. 1977లో విధించిన అత్యవసర పరిస్థితి తరువాత జరిగినలోక్‌సభ ఎన్నికలలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌పై ఐక్య పోరాటం చేయడానికి జనతా పార్టీతో విలీనం అయిన జనసంఘ్ పార్టీ నాయకులు 1980 లో ఏప్రిల్ 6 న బీజేపీని స్థాపించారు. చదవండి: దీపయజ్ఞం మన సంకల్పాన్ని చాటింది : మోదీ -
సరోగసీ బిల్లుపై సూచనలకు సిద్ధం: నడ్డా
న్యూఢిల్లీ: కేంద్రం ఆమోదించిన సరోగసీ (అద్దెగర్భం) బిల్లు ముసాయిదాపై విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో అందులో సూచనలను చేర్చటానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పేర్కొంది. పిల్లలను వదిలిపెట్టటం, మహిళలను దోపిడీ చేయడం వంటి కీలక అంశాలపై మరో మాటకు అవకాశమే లేదని తేల్చిచెప్పింది. పౌరులపై నైతిక విలువలను రుద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలను కేంద్ర ఆరోగ్యమంత్రి నడ్డా తిరస్కరించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది ధర్మబద్ధతకు సంబంధించినదని ఈ రంగంలో సాంకేతిక పురోగతిని సరైన దృక్కోణంతో వినియోగించుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. -
అనంతకుమార్ స్థానంలో నద్దా
న్యూఢిల్లీ: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా సీనియర్ జేపీ నద్దా నియమితులయ్యారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. కేంద్ర మంత్రి అనంత కుమార్ స్థానంలో నద్దాను నియమించారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక, ఇతర ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో 15 మంది సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల కమిటీదే కీలకపాత్ర. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ సభ్యులుగా ఉన్నారు. కాగా సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు స్థానం లభించలేదు.