
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌లో నెలకు పైగా రైలు సర్వీసులు నిలిచిపోవడానికి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగే కారణమంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు మిస్టర్ సింగ్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందన్నారు. నా దృష్టి లో పంజాబ్ లో ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడానికి మీరు పూర్తిగా బాధ్యత వహిస్తారు అని బహిరంగ లేఖలో రాశారు. అమరీందర్ సింగ్ ఇంకా తన లేఖను స్వీకరించలేదని ఆయన అన్నారు. గూడ్స్ రైళ్లను నిలిపివేయడం పై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆదివారం అమరీందర్ సింగ్ జేపీ నడ్డాకు బహిరంగ లేఖ రాశారు. ఇది రాష్ట్రానికి సరఫరా తగ్గి పోవడానికి దోహద పడుతుందని రాష్ట్రంలో ఇప్పటికే బొగ్గు సరఫరా తక్కువగా వుంది.
ఇది ఒక సంక్షోభానికి దారి తీస్తుంది.ఎరువులు,అవసరమైన వస్తువులు కోసం రైతులు ఆందోళన చెందుతున్నారుని లేఖలో రాశారు. దానికి బదులుగా భారత ప్రభుత్వం పంజాబ్‌లో రైళ్లు నడపడానకి చాలా ఆసక్తిగా వుంది కాని మీరు మీ ప్రభుత్వం రాష్ట్ర‍్రంలో ఆశించిన పాత్రను ప్రదర్శంచడం లేదని నడ్డా తిరిగి లేఖ రాశారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని పరిమితులను దాటి" ఆందోళనలను మిస్టర్ సింగ్ మరియు కాంగ్రెస్ బహిరంగంగా ప్రోత్సహించాయి అని అన్నారు. పంజాబ్ ప్రభుత్వం ఆందోళనకారుల పైన ఎటువంటి చర్యలు తీసుకోమని బహిరంగ ప్రకటన చేసిందని అందువల్ల ఆందోళనకారులు రోడ్డు ధర్నాలు, రైల్వే ట్రాక్‌లు పై ధర్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రైతులుంటే బీజేపీకి ఎంతో గౌరవంని, వారి అభివృద్ది కోసం పార్టీ, ప్రభుత్వం ఎల్లప్పడూ సానుకూలమైన చర్యలు తీసుకుంటుందని రాశారు. చైనా, పాకిస్తాన్ రెండింటి నుంచి పెరుగుతున్న దూకుడు చర్యల మధ్య సాయుధ దళాలు అవసరమైన సామాగ్రిని కోల్పోతే పరిస్థితి దేశానికి చాలా ప్రమాదకరంగా మారుతుందనిఆయన లేఖ రాశారు. ఢిల్లీలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గోన్నఅమరీందర్ సింగ్ కేంద్రం ఆర్థిక దిగ్బంధనం లాంటి పరిస్థితిని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment