
షారుక్ సర్రోగసి బేబి సూపర్: అమితాబ్
రంజాన్ పండుగ పురస్కరించుకుని మన్నత్ నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ బచ్చన్ షారుక్ ఖాన్ సర్రోగసి బేబి అబ్ రామ్ ని కలిశాడు. మే 27న అబ్ రామ్ జన్మించిన సంగతి తెలిసిందే. అబ్ రామ్ ఆరోగ్యం సరిగా లేని కారణంగా మీడియాకు ఇతరులకు దూరంగా ఉంచారు. అబ్ రామ్ సూపర్. చాలా బాగున్నాడు. ముద్దొచ్చాడు అని ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈద్ పార్టీకి బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.