పెళ్లి కాకుండానే తండ్రి అయిన హీరో! | Tusshar Kapoor Becomes Father of a Baby Boy | Sakshi
Sakshi News home page

పెళ్లి కాకుండానే తండ్రి అయిన హీరో!

Published Mon, Jun 27 2016 4:56 PM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

పెళ్లి కాకుండానే తండ్రి అయిన హీరో!

పెళ్లి కాకుండానే తండ్రి అయిన హీరో!

‘గోల్‌మాల్’ సిరీస్ సినిమాలను చూసిన వారికి.. అందులో మూగసైగల అభినయంతో, చిత్రవిచిత్రమైన ధ్వనులతో ఆకట్టుకున్న తుషార్‌ కపూర్ గుర్తుండిపోతాడు. బాలీవుడ్‌లో లోప్రొఫైల్ మెయింటెన్ చేసే ఈ హీరో తాజాగా తండ్రి అయ్యాడు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయిన తుషార్‌.. సరోగసీ (అద్దె కడుపు), ఐవీఎఫ్ విధానంలో తనకు కొడుకు పుట్టినట్టు తెలిపాడు. గతవారం పుట్టిన ఈ చిన్నారికి లక్ష్య అని పేరు పెట్టామని, ప్రస్తుతం ఇంటికి చేరిన లక్ష్య ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పాడు.

‘తండ్రి కావడం నాకెంతో ఆనందంగా ఉంది. తండ్రి అయ్యానన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లక్ష నా జీవితంలోకి రావడం మాటలకు అందని ఆనందాన్ని ఇస్తోంది. నా జీవితాన్ని ఎంతో ఆనందాయకంగా ఇది మార్చబోతోంది. దేవుడి అపారమైన దయ వల్ల, జస్‌లోక్ (ఆస్పత్రి) వైద్యసిబ్బంది అద్భుతమైన కృషి వల్ల ఇది సాధ్యమైంది. సింగల్ పెరెంట్ కు (భాగస్వామి లేకుండా పిల్లల్ని కనాలనుకునే వారికి) ఇది నిజంగా గొప్ప ప్రత్యామ్నాయం’ అని తుషార్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. బాలీవుడ్ లో తొలి సింగల్ పెరెంట్‌ గా తుషార్ నిలిచాడు.

అలనాటి హీరో జితేంద్ర-శోభాకపూర్ కూడా తమకు మనవుడు పుట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరోగసీ, ఐవీఎఫ్ విధానం ద్వారా కొడుకును కనాలన్న తమ తనయుడు తుషార్ నిర్ణయాన్ని వారు స్వాగతించారు. తుషార్ ఎంతో బాధ్యతాయుతమైన, స్వతంత్ర దృక్పథం కలిగిన వ్యక్తి అని, అతడు ‘లక్ష్య’కు గొప్ప తండ్రి అవుతాడని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement