Fatherhood
-
నా కూతురి జోలికొస్తే చంపేస్తా: బాలీవుడ్ హీరో
కూతురి కంటే తండ్రికి ఏదీ ఎక్కువ కాదు. తన గారాలపట్టి కోసం ఆకాశంలోని చందమామను తీసుకురావడానికైనా వెనుకాడడు. తండ్రీకూతుళ్ల అనుబంధం అలాంటిది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ఇలాంటి ప్రేమబంధంలోనే మునిగితేలుతున్నాడు. వరుణ్-నటాషా దలాల్ జంటకు ఈ ఏడాది జూన్లో పండంటి కూతురు పుట్టింది. ఆమెకు లారా అని నామకరణం చేశారు.చంపేయాలన్నంత కోపంకూతురు పుట్టాక తనలో వచ్చిన మార్పు గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ఏ మనిషైనా పేరెంట్ అయ్యాక కచ్చితంగా మారతాడు. అలా మగవాడు తండ్రయ్యాక.. కూతురికి ఏమీ కానివ్వకుండా ఎక్కువ రక్షణ కల్పిస్తాడు. ఎవరైనా తనను కాస్త బాధపెట్టినా, చేయి చేసుకున్నా సరే వాళ్లను చంపేయాలన్నంత కోపం వస్తుంది. సీరియస్గా చెప్తున్నా.. నిజంగానే వాళ్లను చంపేయాలనిపిస్తుంది.ఈయన బాధేంటి? అనుకున్నాతండ్రయ్యాకే మా నాన్నను మరింత అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎంత పనున్నా సరే సమయానికి ఇంటికి వచ్చేవాడు. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేవాడు. అప్పుడు నాకస్సలు అర్థమయ్యేది కాదు. ఈయన బాధేంటి? అనుకునేవాడిని. నేనేమీ చిన్నపిల్లాడిని కాదు.. ఎందుకు ఎప్పుడూ అతడితో ఉండాలంటాడు? అని విసుక్కునేవాడిని. ఇప్పుడు నాకు కూతురు పుట్టాక అన్నీ అర్థమవుతున్నాయి అని చెప్పుకొచ్చాడు.చదవండి: గంగవ్వ ఎలిమినేట్.. ఆ కోరిక నెరవేరకుండానే.. -
తండ్రైన 'లైఫ్ ఈజ్బ్యూటిఫుల్' నటుడు సుధాకర్
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' నటుడు సుధాకర్ కోమాకుల తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా సుధాకర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈనెల 14న బాబు బాబు పుట్టాడని, తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నాడు. బాబుకు రుద్ర అని నామకరణం చేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా చిన్నారి ఫోటోను కూడా రివీల్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సహా పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు వెస్ట్ విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2002లో మనసుతో అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సుధాకర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్తో పాపులర్ అయ్యాడు. అయితే ఆ తర్వాతే సరైన అవకాశాలు లేకపోవడం అమెరికా వెళ్లిపోయాడు. ప్రస్తుతం అక్కడే చికాగాలో వీరు సెటిల్ అయ్యారు. View this post on Instagram A post shared by sudhakarkomakula (@sudhakarkomakula) -
పెళ్లి కాకుండానే తండ్రి అయిన హీరో!
‘గోల్మాల్’ సిరీస్ సినిమాలను చూసిన వారికి.. అందులో మూగసైగల అభినయంతో, చిత్రవిచిత్రమైన ధ్వనులతో ఆకట్టుకున్న తుషార్ కపూర్ గుర్తుండిపోతాడు. బాలీవుడ్లో లోప్రొఫైల్ మెయింటెన్ చేసే ఈ హీరో తాజాగా తండ్రి అయ్యాడు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయిన తుషార్.. సరోగసీ (అద్దె కడుపు), ఐవీఎఫ్ విధానంలో తనకు కొడుకు పుట్టినట్టు తెలిపాడు. గతవారం పుట్టిన ఈ చిన్నారికి లక్ష్య అని పేరు పెట్టామని, ప్రస్తుతం ఇంటికి చేరిన లక్ష్య ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పాడు. ‘తండ్రి కావడం నాకెంతో ఆనందంగా ఉంది. తండ్రి అయ్యానన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లక్ష నా జీవితంలోకి రావడం మాటలకు అందని ఆనందాన్ని ఇస్తోంది. నా జీవితాన్ని ఎంతో ఆనందాయకంగా ఇది మార్చబోతోంది. దేవుడి అపారమైన దయ వల్ల, జస్లోక్ (ఆస్పత్రి) వైద్యసిబ్బంది అద్భుతమైన కృషి వల్ల ఇది సాధ్యమైంది. సింగల్ పెరెంట్ కు (భాగస్వామి లేకుండా పిల్లల్ని కనాలనుకునే వారికి) ఇది నిజంగా గొప్ప ప్రత్యామ్నాయం’ అని తుషార్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. బాలీవుడ్ లో తొలి సింగల్ పెరెంట్ గా తుషార్ నిలిచాడు. అలనాటి హీరో జితేంద్ర-శోభాకపూర్ కూడా తమకు మనవుడు పుట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరోగసీ, ఐవీఎఫ్ విధానం ద్వారా కొడుకును కనాలన్న తమ తనయుడు తుషార్ నిర్ణయాన్ని వారు స్వాగతించారు. తుషార్ ఎంతో బాధ్యతాయుతమైన, స్వతంత్ర దృక్పథం కలిగిన వ్యక్తి అని, అతడు ‘లక్ష్య’కు గొప్ప తండ్రి అవుతాడని చెప్పారు.