
కూతురి కంటే తండ్రికి ఏదీ ఎక్కువ కాదు. తన గారాలపట్టి కోసం ఆకాశంలోని చందమామను తీసుకురావడానికైనా వెనుకాడడు. తండ్రీకూతుళ్ల అనుబంధం అలాంటిది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ఇలాంటి ప్రేమబంధంలోనే మునిగితేలుతున్నాడు. వరుణ్-నటాషా దలాల్ జంటకు ఈ ఏడాది జూన్‌లో పండంటి కూతురు పుట్టింది. ఆమెకు లారా అని నామకరణం చేశారు.

చంపేయాలన్నంత కోపం
కూతురు పుట్టాక తనలో వచ్చిన మార్పు గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ఏ మనిషైనా పేరెంట్ అయ్యాక కచ్చితంగా మారతాడు. అలా మగవాడు తండ్రయ్యాక.. కూతురికి ఏమీ కానివ్వకుండా ఎక్కువ రక్షణ కల్పిస్తాడు. ఎవరైనా తనను కాస్త బాధపెట్టినా, చేయి చేసుకున్నా సరే వాళ్లను చంపేయాలన్నంత కోపం వస్తుంది. సీరియస్‌గా చెప్తున్నా.. నిజంగానే వాళ్లను చంపేయాలనిపిస్తుంది.
ఈయన బాధేంటి? అనుకున్నా
తండ్రయ్యాకే మా నాన్నను మరింత అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎంత పనున్నా సరే సమయానికి ఇంటికి వచ్చేవాడు. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేవాడు. అప్పుడు నాకస్సలు అర్థమయ్యేది కాదు. ఈయన బాధేంటి? అనుకునేవాడిని. నేనేమీ చిన్నపిల్లాడిని కాదు.. ఎందుకు ఎప్పుడూ అతడితో ఉండాలంటాడు? అని విసుక్కునేవాడిని. ఇప్పుడు నాకు కూతురు పుట్టాక అన్నీ అర్థమవుతున్నాయి అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment