గంగవ్వ ఎలిమినేట్‌.. ఆ కోరిక నెరవేరకుండానే.. | Bigg Boss Telugu 8: Gangavva Eliminated from BB House Because Health Issues | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: ఆ కారణం వల్లే గంగవ్వ ఎలిమినేట్‌.. ఆ కోరిక నెరవేరకముందే..

Published Sat, Nov 9 2024 6:01 PM | Last Updated on Sat, Nov 9 2024 6:39 PM

Bigg Boss Telugu 8: Gangavva Eliminated from BB House Because Health Issues

ఎవిక్షన్‌ షీల్డ్‌ కోసం బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ పెట్టాడు. చివర్లో తేజ, యష్మితో ఏకాభిప్రాయానికి రాకుండా నిఖిల్‌ ఎగ్‌ను పాము నోట్లో వేశాడు. ఆ కోపంతో యష్మి కూడా రోహిణి ఎగ్‌ను పాముకు ఆహారంగా వేసింది. ఒక జంట ఒక ఎగ్‌ మాత్రమే వేయాలన్నది రూల్‌. ఈ నియమాన్ని ఇద్దరూ బ్రేక్‌ చేయడంతో ఎవిక్షన్‌ షీల్డ్‌ గేమ్‌ అర్ధాంతరంగా ఆగిపోయింది.

ఎలిమినేషన్‌
దీంతో నాగ్‌ సమక్షంలో ఎవిక్షన్‌ షీల్డ్‌ కోసం హౌస్‌మేట్స్‌ అభిప్రాయాలు కోరాడు. అలా ఈ షీల్డ్‌ నబీల్‌ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వారం పృథ్వీ ఎలిమినేట్‌ అవుతాడని, లేదు యష్మి వెళ్లిపోతుందని తెగ ప్రచారం జరుగుతోంది. చివరకు ఈ రెండూ ఉట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి.

అనారోగ్యం వల్లే.
అనారోగ్య కారణాల వల్ల గంగవ్వను హౌస్‌ నుంచి బయటకు పంపించేశారట. చలాకీగా మాట్లాడుతూ.. చిన్నపాటి ఆటల్లోనూ పాల్గొంటూ అలరించింది అవ్వ. ఎలాగైనా ఫ్యామిలీ వీక్‌ వరకు ఉండాలనుకుంది. ఇందుకోసం తనను నామినేట్‌ చేయొద్దని హౌస్‌మేట్స్‌ను కోరింది. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో హౌస్‌లో ఉండలేక వెళ్లిపోవడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement