సమంత కష్టాలు చిన్నవి కావు.. ఒకరోజు ఆక్సిజన్‌ ట్యాంక్‌.. | Varun Dhawan Panicked When Samantha Ruth Prabhu Collapsed on Citadel: Honey Bunny Set | Sakshi
Sakshi News home page

Varun Dhawan: సామ్‌ సెట్‌లో సడన్‌గా పడిపోయింది.. తన పరిస్థితి చూసి భయమేసింది!

Published Sun, Nov 10 2024 5:40 PM | Last Updated on Sun, Nov 10 2024 6:13 PM

Varun Dhawan Panicked When Samantha Ruth Prabhu Collapsed on Citadel: Honey Bunny Set

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ధావన్‌, టాలీవుడ్‌ బ్యూటీ సమంత ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌: హనీ బన్నీ. ఈ థ్రిల్లర్‌ షోకి రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సిరీస్‌ ప్రమోషన్లలో భాగంగా వరుణ్‌ ధావన్‌ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

సమంత కోసం ఆక్సిజన్‌ ట్యాంక్‌
అతడు మాట్లాడుతూ.. సమంతతో కలిసి నటిస్తున్నప్పుడు కొంచెం టెన్షన్‌పడేవాడిని. ఎందుకంటే ఒక రోజు షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఆమె కళ్లు మూసుకుని ఇది మళ్లీ అలాంటి రోజే అని చెప్పింది. అప్పటికే మేము రెండు గంటలుగా షూట్‌ చేస్తున్నాం. తర్వాత కాస్త బ్రేక్‌ చెప్పారు. వెంటనే ఒక ఆక్సిజన్‌ ట్యాంక్‌ వచ్చింది. అది సమంత కోసమే! తన పరిస్థితి చూసి భయమేసింది.

ఉన్నట్లుండి పడిపోయింది
ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పి లీవ్‌ తీసుకోవచ్చు.. కానీ ఆమె అలా చేయలేదు. పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మరోసారి ఏమైందంటే.. సెర్బియాలోని ఓ రైల్వే స్టేషన్‌లో షూటింగ్‌.. తను నా వెనక పరిగెత్తాలి. నేను పరిగెత్తుతున్నా.. తనూ నా వెనకే వేగంగా వస్తోంది. ఇంతలో ఉన్నట్లుండి కుప్పకూలింది. నేను వెంటనే తనను పట్టుకుని ప్యాకప్‌ చెప్పాను.

తనొక ఇన్‌స్పిరేషన్‌
అయితే రాజ్‌ అండ్‌ డీకే టెన్షన్‌ పడొద్దన్నారు. కాసేపటికి తనే మళ్లీ సాధారణ స్థితికి వస్తుందన్నారు. అలాంటి కండీషన్‌లోనూ తను సత్తువ కూడదీసుకుని యాక్ట్‌ చేస్తుందంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే.. సమంత కష్టాల ముందు నావి చాలా చిన్నవి. ఆమె నిజంగా ఇన్‌స్పిరేషన్‌ అని చెప్పుకొచ్చాడు.

మయోసైటిస్‌
కాగా మయోసైటిస్‌ వ్యాధివల్ల సిటాడెల్‌ సిరీస్‌ చేయడానికి మొదట సమంత ఒప్పుకోలేదు. తనకు బదులుగా వేరే హీరోయిన్లను సంప్రదించమని అడిగింది. అయినా దర్శకులు సమంతే కావాలని పట్టుపట్టడంతో చివరికి ఒప్పుకోక తప్పలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement