
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' నటుడు సుధాకర్ కోమాకుల తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా సుధాకర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈనెల 14న బాబు బాబు పుట్టాడని, తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నాడు. బాబుకు రుద్ర అని నామకరణం చేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా చిన్నారి ఫోటోను కూడా రివీల్ చేశాడు.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సహా పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు వెస్ట్ విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2002లో మనసుతో అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సుధాకర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌తో పాపులర్ అయ్యాడు. అయితే ఆ తర్వాతే సరైన అవకాశాలు లేకపోవడం అమెరికా వెళ్లిపోయాడు. ప్రస్తుతం అక్కడే చికాగాలో వీరు సెటిల్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment