sudhakar komakula
-
'మెమొరీస్' సాంగ్.. హీరో సుధాకర్.. మరి హీరోయిన్?
నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ నటుడు సుధాకర్ కోమాకుల 'మెమొరీస్' అనే బహుభాషా మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ పాటను సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్‌తో కలిపి చిత్రీకరించారు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నివ్రితి వైబ్స్ వారు ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ రైట్స్ సొంతం చేసుకోవడం విశేషం. 'మెమొరీస్' వీడియో సాంగ్‌ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నివ్రితి వైబ్స్ యూట్యూబ్ వేదికపై హీరో అడివి శేష్ రిలీజ్ చేశారు. అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో అన్వేష్.. సైమా అవార్డ్స్‌లో నామినేట్ అయిన 'చోటు' అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్‌గా, సోని మ్యూజిక్‌లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం 'మనోహరం'కి రైటర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడనేదే ఈ సాంగ్. ఈ పాటని అరుణ్ చంద్రశేఖరన్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. ఈ వీడియో సాంగ్ దృశ్యం పరంగా ఆకట్టుకుంటూ సింపుల్ హుక్ స్టెప్ కూడా కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా ఆ స్టెప్ ఉంటుంది. సుధాకర్ కోమాకుల నేతృత్వంలో నిర్మించబడిన ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసేలా ఉంది. చదవండి: శివాజీ ప్రవర్తన వల్ల బాధపడ్డా.. ఆ నొప్పితో బాధపడుతున్న అమర్.. అందుకే టాస్క్‌లు.. -
సుధాకర్ కోమాకుల 'మెమొరీస్'మ్యూజిక్ వీడియో వచ్చేస్తోంది!
నారాయణ అండ్ కో చిత్రంతో అలరించిన యంగ్ హీరో సుధాకర్ కోమాకుల..ఇప్పుడు ‘మోమురీస్’అనే మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నాడు. ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు. శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించారు. అతి త్వరలో 'మెమొరీస్' వీడియో సాంగ్ ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నివ్రితి వైబ్స్ యూట్యూబ్ వేదికపై రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నివ్రితి వైబ్స్ వారు ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ రైట్స్ ను సొంతం చేసుకోవడం విశేషం. వర్ధమాన ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో అన్వేష్ సైమా అవార్డ్స్ లో నామినేట్ అయిన 'చోటు' అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్ గా.. సోని మ్యూజిక్ లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం 'మనోహరం'కి రైటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు అనేది ఉంటుంది. ఈ పాటని అరుణ్ చంద్రశేఖరన్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. -
ఓటీటీలోకి వచ్చేసిన ‘నారాయణ అండ్ కో’
సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన తాజా చిత్రం నారాయణ అండ్ కో. ‘ది తిక్కల్ ఫ్యామిలీ'అనేది ట్యాగ్ లైన్. జూన్ 30న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మూవీ కాన్సెప్ట్ బాగా ఉందని ప్రశంసలు వచ్చినా ప్రమోషన్లు సరిగా లేకపోవడంతో మూవీ పెద్దగా ఆడలేకపోయింది. దీనికి తోడు ఆ సమయంలో థియేటర్లలో భారీ సినిమాలు ఉండడంతో పోటీ ముందు నిలబడలేకపోయింది. అయితే ఇప్పుడీ ‘నారాయణ అండ్ కో మూవీ’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ‘నారాయణ అండ్ కో’ కథేంటంటే.. నారాయణ(దేవి ప్రసాద్), జానకి(ఆమని) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. నారాయణ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. పెద్ద కొడుకు ఆనంద్(సుధాకర్ కోమకుల) క్యాబ్ డ్రైవర్. క్రికెట్లో బెట్టింగ్ పెడుతుంటాడు. దీంతో అతనికి రూ.10 లక్షల వరకు అప్పు అవుతుంది. చిన్న కొడుకు సుభాష్ (జై కృష్ణ) కెమెరామెన్. ఓ చావు ఇంటికి ఫోటోలు తీయడానికి వెళ్లి ఓ అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోని పంపి, రూ. 10 లక్షలు ఇవ్వకుంటే ఆది వైరల్ చేస్తానని బెదిరిస్తాడు ఓ అజ్ఞాత వ్యక్తి. మరోవైపు నారాయణ పని చేసే బ్యాంకులో రూ.25 లక్షల దొంగతనం జరుగుంది. అది నారాయణ మీదకు వస్తుంది. రూ.25 లక్షలు తిరిగి ఇవ్వకుంటే పోలీసు కేసు పెడతానని మేనేజర్ బెదిరిస్తాడు. దీంతో నారాయణ ఫ్యామిలీ అంతా డబ్బు కోసం ఎవరినైనా కిడ్నాప్ చేయాలని భావిస్తారు. నారాయణ మేనకోడలు నళిని(పూజా కిరణ్)తో కలిసి కిడ్నాప్‌కి ప్లాన్ చేస్తే వర్కౌట్ కాదు. ఇదే సమయంలో వారికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రౌడీ శంకర్(తోటపల్లి మధు) తరపున ఓ డీల్ వస్తుంది. ముంబైకి వెళ్లి ఓ పిల్లి బొమ్మను తీసుకువస్తే.. రూ. కోటి ఇస్తామని ఆఫర్ ఇస్తారు. దీంతో నారాయణ ఫ్యామిలీ వెంటనే ఆ డీల్ ఒప్పుకుంటారు. మరి ఒప్పందం ప్రకారం పిల్లి బొమ్మను నారాయణ& కో తీసుకొచ్చిందా? పిల్లి బొమ్మను తీసుకొచ్చే క్రమంలో నారాయణ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు ఆ పిల్లి బొమ్మలో ఏం ఉంది? బ్యాంకులో డబ్బులు కొట్టేసింది ఎవరు? సుభాష్‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నదెవరు? ఎస్సై అర్జున్(అలీ రెజా) వారిని ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. -
'మెమొరీస్' తో వచ్చేస్తున్న సుధాకర్ కొమాకుల
నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ యువ నటుడు సుధాకర్ కొమాకుల 'మెమొరీస్' అనే మ్యూజిక్ వీడియోతో రాబోతున్నాడు. ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మిస్తున్నాడు. శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించారు. అతి త్వరలో 'మెమొరీస్' వీడియో సాంగ్ ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో యూట్యూబ్ వేదికపై రిలీజ్ చేయనున్నారు. వర్ధమాన ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది.మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు అనేది ఉంటుంది. ఈ పాటని వరుణ్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. త్వరలోనే ఈ మ్యూజిక్ వీడియో విడుదల కాబోతుంది. -
‘నారాయణ & కో’ మూవీ రివ్యూ
టైటిల్: ‘నారాయణ & కో’ నటీనటులు: సుధాకర్ కోమకుల, ఆర్తిపొడి, దేవి ప్రసాద్, ఆమని, పూజ కిరణ్, సప్తగిరి తదితరులు నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్, సుధాకర్ కోమకుల దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి సంగీతం: సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాస్తవ్ విడుదల తేది: జూన్ 30, 2023 కథేంటంటే.. నారాయణ(దేవి ప్రసాద్), జానకి(ఆమని) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. నారాయణ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. పెద్ద కొడుకు ఆనంద్(సుధాకర్ కోమకుల) క్యాబ్ డ్రైవర్. క్రికెట్లో బెట్టింగ్ పెడుతుంటాడు. దీంతో అతనికి రూ.10 లక్షల వరకు అప్పు అవుతుంది. చిన్న కొడుకు సుభాష్ (జై కృష్ణ) కెమెరామెన్. ఓ చావు ఇంటికి ఫోటోలు తీయడానికి వెళ్లి ఓ అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోని పంపి, రూ. 10 లక్షలు ఇవ్వకుంటే ఆది వైరల్ చేస్తానని బెదిరిస్తాడు ఓ అజ్ఞాత వ్యక్తి. మరోవైపు నారాయణ పని చేసే బ్యాంకులో రూ.25 లక్షల దొంగతనం జరుగుంది. అది నారాయణ మీదకు వస్తుంది. రూ.25 లక్షలు తిరిగి ఇవ్వకుంటే పోలీసు కేసు పెడతానని మేనేజర్ బెదిరిస్తాడు. దీంతో నారాయణ ఫ్యామిలీ అంతా డబ్బు కోసం ఎవరినైనా కిడ్నాప్ చేయాలని భావిస్తారు. నారాయణ మేనకోడలు నళిని(పూజా కిరణ్)తో కలిసి కిడ్నాప్‌కి ప్లాన్ చేస్తే వర్కౌట్ కాదు. ఇదే సమయంలో వారికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రౌడీ శంకర్(తోటపల్లి మధు) తరపున ఓ డీల్ వస్తుంది. ముంబైకి వెళ్లి ఓ పిల్లి బొమ్మను తీసుకువస్తే.. రూ. కోటి ఇస్తామని ఆఫర్ ఇస్తారు. దీంతో నారాయణ ఫ్యామిలీ వెంటనే ఆ డీల్ ఒప్పుకుంటారు. మరి ఒప్పందం ప్రకారం పిల్లి బొమ్మను నారాయణ& కో తీసుకొచ్చిందా? పిల్లి బొమ్మను తీసుకొచ్చే క్రమంలో నారాయణ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు ఆ పిల్లి బొమ్మలో ఏం ఉంది? బ్యాంకులో డబ్బులు కొట్టేసింది ఎవరు? సుభాష్‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నదెవరు? ఎస్సై అర్జున్(అలీ రెజా) వారిని ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. విశ్లేషణ అనుకోకుండా వచ్చిన ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకు ఓ కుటుంబం అంతా కలిసి చేసే తింగరి పనులే ‘నారాయణ అండ్ కో మూవీ కథ. అందుకే ఈ చిత్రానికి ‘ది తిక్కల్ ఫ్యామిలీ ’ట్యాగ్ లైన్ పెట్టారు. దానికి తగ్గట్టే కథనం సాగుతుంది. కానీ ప్రతి సన్నివేశం గత సినిమాలను గుర్తుకు తెస్తుంది. కథ-కథనంలో ఎలాంటి కొత్తదనం లేకపోగా చాలా వరకు సీన్స్ బోర్ గా కొనసాగుతాయి. నారాయణ ఫ్యామిలీ పాత్రల పరిచయాలతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరోహీరోయిన్లు పబ్‌లో కలసుకోవడం.. ప్రెగ్నెంట్ అయ్యానంటూ పెళ్లి చేసుకోవడం.. చకచకా జరిగిపోతుంది. అయితే హీరోపై హీరోయిన్‌కి లవ్ పుట్టే రీజన్ కన్విసింగ్‌గా అనిపించలేదు. కొన్ని కామెడీ సన్నివేశాలతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక సెకండాఫ్ మాత్రం రొటీన్‌గా సాగుతుంది. కథ-కథనమే బోరింగ్ అనుకుంటే.. సంబంధం లేకుండా వచ్చే పాటలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. ఓవరాల్‌గా ‘నారాయణ అండ్ కో’ ప్రేక్షకులను నవ్వించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయింది. ఎవరెలా చేశారంటే.. ఆనంద్ పాత్రకు సుధాకర్ న్యాయం చేశాడు. ఈ సినిమాలో డ్యాన్స్ కూడా అదరగొట్టాడు. హీరో తమ్ముడు సుభాష్‌గా జైకృష్ణ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కొత్తదనం ఎంటంటే.. దేవీ ప్రసాద్, ఆమని పూర్తిగా కామెడీ రోల్ ప్లే చేయడం. నారాయణగా దేవీ ప్రసాద్, జానకిగా ఆమని చేసే కొన్ని కామెడీ సీన్స్ అలరిస్తాయి. సినిమాలో వీరిద్దరికే ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఎస్సై అర్జున్‌గా అలీ రెజా, ప్రీతిగా ఆర్తిలు ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే వీరి పాత్రల నిడివి చాలా తక్కువ. సప్తగిరి కామెడీ వర్కౌట్ కాలేదు. పూజ కిరణ్, తోటపల్లి మధుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాకొస్తే సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ సంగీతం పర్వాలేదు. ‘దండక డన్ డన్’ మినహా మిగతా పాటలేవి ఆకట్టుకోలేవు. బీజీఎం ఓకే. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాత విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
అందుకే ఈ సినిమా నిర్మించా!
‘‘నారాయణ అండ్ కో’ కథని డైరెక్టర్ చిన్నా చెప్పినప్పుడు గమ్మత్తుగా అనిపించింది. ఫ్యామిలీ అండ్ క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకునేలా ఉంటుంది’’ అని సుధాకర్ కోమాకుల అన్నారు. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘నారాయణ అండ్ కో’. పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కోమాకుల నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ– ‘‘నాకు నిర్మాణంపై ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. మొదటి నుంచి వీడియోస్, కవర్ సాంగ్స్ చేస్తూనే ఉన్నాను. సినిమా నిర్మాణంలోకి రావాలనుకున్నప్పుడు ‘నారాయణ అండ్ కో’ సరైన సినిమా అనిపించింది. నాకు వినోదం అంటే చాలా ఇష్టం. ఈ మూవీలో పూర్తి స్థాయి వినోదం పంచే పాత్ర చేసే అవకాశం దక్కింది. ఇక పదేళ్లకు పైగా ఉన్న నా సినీ ప్రయాణంలో రావాల్సినంత ఫేమ్ రాలేదు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా తర్వాత మరో సోలో చిత్రం పడుంటే నా కెరీర్ తర్వాతి స్థాయికి వెళ్లేది. డైరెక్టర్ అనిల్ రావిపూడి నాకు మంచి స్నేహితుడు. తన సినిమాలో ఓసారి మంచి పాత్ర చేసే అవకాశం వచ్చింది.. కానీ చేయలేక΄ోయాను. నాకు సరైన పాత్ర ఇవ్వాలని అనిల్‌కి కూడా ఉంది. ‘క్రాక్’ సినిమా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చాయి. కానీ, నేనే ఆసక్తి చూపలేదు.. లీడ్ రోల్స్‌పైనే దృష్టి పెట్టాను. ప్రస్తుతం ‘జీడీ’ (గుండెల్లో దమ్ము) సినిమాతో పాటు 1980 నేపథ్యంలో ఒక ప్రేమకథా చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. -
నారాయణతో సుధాకర్‌కి బ్రేక్ వస్తుంది: అనిల్ రావిపూడి
‘‘నారాయణ అండ్ కో’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సుధాకర్ నా స్నేహితుడు. తనతో నాది లాంగ్ జర్నీ. తనకి ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో చక్కని టేకాఫ్ వచ్చింది. ‘నారాయణ అండ్ కో’తో మంచి బ్రేక్ వస్తుందనుకుంటున్నాను’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. సుధాకర్ కోమాకుల హీరోగా చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘నారాయణ అండ్ కో’. పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కోమాకుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. (చదవండి: 'ఆదిపురుష్' ఎఫెక్ట్.. ఆ 'రామాయణం' మళ్లీ రిలీజ్) ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు దర్శకులు అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడల, హీరో తిరువీర్, నిర్మాత రాజ్ కందుకూరి, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అతిథులుగా హాజరై, ‘నారాయణ అండ్ కో’ విజయం సాధించాలి అన్నారు. సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ– ‘‘నారాయణ అండ్ కో’ సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా’’ అన్నారు. ‘‘ఇది ఫ్యామిలీ ఫండింగ్ మూవీ. చాలామంది సపోర్ట్‌తో ఈ సినిమా చేశాం’’ అన్నారు దర్శక–నిర్మాత చిన్నా పాపిశెట్టి. -
‘నారాయణ & కో’ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పిల్లి బొమ్మ వస్తుంది!
‘నెక్ట్స్ టెన్ డేస్‌లో చాలా పెద్ద డీల్ ఉంది. దుబాయ్ నుంచి ముంబైకి ఒక పిల్లి బొమ్మ వస్తుంది. దాన్ని చాలా సేఫ్‌గా మన దగ్గరకు చేర్చాలి’ అనే డైలాగ్‌తో ‘నారాయణ అండ్ కో’ సినిమా ట్రైలర్ విడుదలైంది. సుధాకర్ కోమాకుల హీరోగా చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘నారాయణ అండ్ కో’. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కోమాకుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు ‘‘చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘నారాయణ అండ్ కో’ రూపొందింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
తండ్రైన 'లైఫ్ ఈజ్బ్యూటిఫుల్' నటుడు సుధాకర్
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' నటుడు సుధాకర్ కోమాకుల తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా సుధాకర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈనెల 14న బాబు బాబు పుట్టాడని, తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నాడు. బాబుకు రుద్ర అని నామకరణం చేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా చిన్నారి ఫోటోను కూడా రివీల్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సహా పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు వెస్ట్ విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2002లో మనసుతో అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సుధాకర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌తో పాపులర్ అయ్యాడు. అయితే ఆ తర్వాతే సరైన అవకాశాలు లేకపోవడం అమెరికా వెళ్లిపోయాడు. ప్రస్తుతం అక్కడే చికాగాలో వీరు సెటిల్ అయ్యారు. View this post on Instagram A post shared by sudhakarkomakula (@sudhakarkomakula) -
ఎన్.ఐ.ఏ. ఆఫీసర్‌గా కార్తికేయ
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. తాన్యా రవిచంద్రన్ కథానాయిక. సుధాకర్ కోమాకుల ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. టి. ఆదిరెడ్డి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీ సరిపల్లి మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇందులో కార్తికేయ ఎన్.ఐ.ఏ. ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆయన పాత్ర ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు పాటలు ఉంటాయి. ‘మెంటల్ మదిలో’, ‘దొరసాని’, ’అంతరిక్షం’ చిత్రాలకు స్వరాలందించిన ప్రశాంత్ ఆర్. విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు. రామారెడ్డి మాట్లాడుతూ – ‘‘వీవీ వినాయక్ శిష్యుడైన శ్రీ సరిపల్లిని మా చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. చాలా మంచి కథ ఇది. కార్తికేయ పాత్ర చాలా బాగుంటుంది. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్‌లో జరిపే షెడ్యూల్‌తో 90 శాతం సినిమా పూర్తవుతుంది. మిగిలిన 10 శాతాన్ని మారేడుమిల్లిలో చిత్రీకరిస్తాం’’ అన్నారు. చదవండి: ఆ ఆలోచనను విరమించుకున్న ‘సర్కారు వారి పాట’ టీమ్ కపిల్ శర్మ గురించి ఈ నిజాలు తెలుసా? -
బిగ్‌బాస్ ట్రోఫీ తీసుకురా, దావత్ చేసుకుందాం
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ముగింపుకు చేరుకుంటున్న సమయంలో లోపలున్న కంటెస్టెంట్లను గెలిపించేందుకు అభిమానులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా లెక్క ప్రకారం ఇప్పుడున్న ఫైనలిస్టుల్లో అభిజిత్‌కే ప్రేక్షకుల సపోర్ట్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దీనికి తోడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సైతం అభికే మద్దతు తెలిపాడు. వీరిద్దరూ గతంలో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలో కలిసి నటించారు. ఇదే సినిమాలో నటించిన మరో హీరో సుధాకర్ కోమాకుల కూడా మొదటి నుంచి అభికే తన మద్దతు తెలుపుకుంటూ వచ్చాడు. బిగ్‌బాస్ ఫైనల్ వీక్‌లోకి అడుగు పెట్టిన సందర్భంగా సుధాకర్ మరో స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. (చదవండి: బిగ్‌బాస్ : కుక్క అనుకున్నా పర్లేదు.. అఖిల్) ఏ కంటెస్టెంటుకు రాని పాపులారిటీ.. "బిగ్‌బాస్ కంటెస్టెంటు అభిజిత్ నా క్లోజ్ ఫ్రెండ్. టైటిల్ దక్కించుకునేందుకు ముందు వరుసలో ఉన్నాడు. రెండు నెలల క్రితం అతడి గురించి వీడియో చేసినప్పుడు పాజిటివ్‌తో పాటు నెగెటివ్ కామెంట్లు కూడా వచ్చాయి. అయితే అప్పటికీ, ఇప్పటికీ అభి గ్రాఫ్ పెరిగిపోయింది. అతడిని బిగ్‌బాస్ విన్నర్‌గా చూడాలనుకుంటున్నా. అతడు హౌస్‌లో అందరూ సర్ప్రైజ్ అయ్యేలా పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇన్ని సీజన్లలో ఏ కంటెస్టెంటుకు రాని పాపులారిటీ అభికి వచ్చింది. కానీ అతడు బిగ్‌బాస్‌లోకి వెళ్లినప్పుడు టైటిల్ ఫేవరెట్ కాదనే చెప్పాలి. లోపలికి వెళ్లే వారం ముందు నాతో మాట్లాడాడు. నేను నాలా ఉంటా. పార్టిసిపేట్ చేస్తా అన్నాడు. అరేయ్ మామా, మనం ఒక్కసారి దిగినమంటే సిక్స్ కొడితే బాల్ స్టేడియం అవతల పడాల్సిందే, టైటిల్ గెలవాల్సిందేనని చెప్పాను. అతడేమో ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నా కానీ చూద్దామని చెప్పాడు." (చదవండి: ఆ హౌజ్మెట్కే నా మద్దతు: విజయ్ దేవరకొండ) నీ కోసం అమెరికా నుంచి వచ్చాను "ఎన్నిసార్లు నామినేషన్లోకి వెళ్లినా ప్రేక్షకులు ఎక్కువ ఓట్లు వేసి సేఫ్ చేశారు. రోబో టాస్క్ తర్వాత అతడికి పేరొచ్చింది. భుజాల నొప్పి, మోకాళ్ల సమస్య ఉండటం వల్ల ఫిజికల్ టాస్కులు చేయలేకపోయాడు. అయినా సరే తన బెస్ట్ ఇచ్చాడు. ఏ పరిస్థితిలోనైనా బ్యాలెన్స్‌గా ఉంటాడు. బయట ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. టాస్క్‌లో ఫ్రెండ్స్‌ను పక్కన పెట్టాడు. ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తే వెళ్లి సాయం చేస్తాడు. ఏదైనా తప్పు చేస్తే సారీ చెప్పి దాన్ని సరిదిద్దుకున్నాడు. ఇలా ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్న అభికి ఓటు వేసి గెలిపించండి" అని సుధాకర్ అభిమానులను కోరాడు. చివర్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలోని నాగరాజు పాత్రలోకి దూరిపోయి ఓ డైలాగ్ విసిరాడు. "అరేయ్ మామా అభిజిత్, బిగ్‌బాస్ ట్రోఫీ తీసుకుని రా. బీ ఫేస్ మొత్తం వెయిట్ చేస్తుంది. మస్త్ దావత్ చేసుకుందాం. ఎంజాయ్ చేద్దాం. అమెరికా నుంచి వచ్చినరా బై నీకోసం.. బిగ్‌బాస్ 4 విన్నర్ కావాలి చెప్తున్నా.." అంటూ అభిని విజేతగా నిలపండని ప్రేక్షకులకు పిలుపునిచ్చాడు. (చదవండి: అరియానాకు ఓటేయమని ఆర్జీవీ పిలుపు) -
చిరు ఫిదా: హారికకే ఎక్కువ మార్కులు
సాక్షి, హైదరాబాద్: చిరంజీవి వీరాభిమాని, యంగ్ హీరో సుధాకర్ కోమాకుల తన భార్య హారికతో కలిసి అందించిన బర్త్ డే గిఫ్ట్ కు మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయిపోయారు. ఈ మేరకు సుధాకర్-హారిక దంపతులకు అభినందనలు తెలుపుతూ చిరంజీవి ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. 'డాన్స్ రీ-క్రియేషన్' అద్భుతంగా ఉందంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఆ పాట తీస్తున్నంత సేపు తనను తలుచుకోవడం ఇంకా ఆనందంగా ఉందన్నారు. (చదవండి: నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నా! ) అంతేకాదు టెక్ గర్ల్ హారిక అంత ఈజ్‌తో గ్రేస్‌ఫుల్ స్టెప్పులు వేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ విషయంలో నీకంటే హారికకే ఎక్కువ మార్కులు ఇస్తున్నానంటూ సుధాకర్‌ను ఉడికించారు. అమెరికాలో ఉన్నారు కనుక వ్యక్తిగతంగా మీ ఇద్దర్నీ కలవలేకపోతున్నాను. కలకాలం హాయిగా ఉండండి అంటూ సుధాకర్-హారిక దంపతులను మెగాస్టార్ ఆశీర్వదించారు. దీంతో వారు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాగా చిరంజీవి నటించిన 'ఛాలెంజ్'లో అల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ 'ఇందువదన కుందరదన.. పాటను 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' నటుడు సుధాకర్ కోమాకుల తన శ్రీమతి హారికతో కలిసి రీక్రియేట్ చేయడం, అది కాస్తా సోషల మీడియాలో దూసుకుపోవడం తెలిసిందే. (చదవండి: అలాంటి కథలు నమ్మొద్దు) #Megastar @KChiruTweets responds on Actor #SudhakarKomakula @UrsSudhakarK's attempt to give a Birthday special dance tribute along with his wife #HarikaSandepogu. Impressed with their intention & dance, Chiru thanks them with a Virtual Voice message. #MegastarChiranjeevi pic.twitter.com/k6vkwafHqG — BARaju (@baraju_SuperHit) August 28, 2020 -
‘నువ్వు తోపురా’ మూవీ రివ్యూ
టైటిల్ : నువ్వు తోపురా జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : సుధాకర్ కోమాకుల, నిత్య శెట్టి, నిరోషా, వరుణ్ సందేశ్ సంగీతం : సురేష్ బొబ్బిలి, పీఏ దీపక్ దర్శకత్వం : బి. హరినాథ్ బాబు నిర్మాత : శ్రీకాంత్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో నాగరాజు పాత్రలో తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు సుధాకర్ కోమాకుల. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ నటుడు సోలో హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం నువ్వు తోపురా. అమెరికా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాకు హరినాథ్ బాబు దర్శకుడు. తొలి సినిమాతో పక్కింటి అబ్బాయిగా కనిపించిన సుధాకర్ ఈ సినిమాలో హీరోయిజం చూపించే ప్రయత్నం చేశాడు. మరి సోలో హీరోగా సుధాకర్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు.? నువ్వు తోపురా అనిపించుకున్నాడా..? కథ : సూరి (సుధాకర్ కోమాకుల) బీటెక్ మధ్యలోనే ఆపేసి హైదరాబాద్, సరూర్ నగర్ గల్లీల్లో అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవటం, తల్లి (నిరోష) ఉద్యోగం కారణంగా తనతో ఎక్కువ సమయం గడపలేకపోవటంతో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ జులాయిగా తయారవుతాడు. కుటుంబం అంటే పట్టని సూరి, రమ్య (నిత్య శెట్టి) అనే అమ్మాయికి దగ్గరవుతాడు. కానీ కొన్ని కారణాల వల్ల రమ్య కూడా సూరిని వదిలేసి అమెరికా వెళ్లిపోతుంది. అదే సమయంలో అమెరికాలోని తెలుగు అసోషియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో డప్పులు వాయించడానికి సూరికి అవకాశం వస్తుంది. రమ్య మీద కోపంతో వెంటనే అమెరికా వెళ్లేందుకు ఒప్పుకుంటాడు సూరి. అలా అమెరికా వెళ్లిన సూరి ఎలాంటి కష్టాలు అనుభవించాడు.? సూరికి డ్రగ్ మాఫియాతో ఎందుకు పోరాడాల్సి వచ్చింది..? అమెరికా జీవితం సూరిలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది? అన్నదే మిగతా కథ. నటీనటులు : లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్లో నాగరాజు పాత్రలో ఈజీగా నటించేసిన సుధాకర్, ఈ సినిమాలో వేరియేషన్స్ చూపించటంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. బిందాస్ కుర్రాడిగా ఆకట్టుకున్నా.. ఎమోషనల్ సీన్స్‌లో అంతగా మెప్పించలేకపోయాడు. కామెడీ, డైలాగ్స్ డెలివరీతో మాత్రం మంచి మార్కులు సాధించాడు. ముఖ్యంగా తెలంగాణ యాసలో సుధాకర్ చెప్పిన డైలాగ్స్ అలరిస్తాయి. బాలనటిగా ఆకట్టుకున్న నిత్య శెట్టి హీరోయిన్ గా మెప్పించలేక పోయిందనే చెప్పాలి. నటనకు పెద్దగా స్కోప్ లేకపోవటం కూడా నిత్యకు మైనస్ అయ్యింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన నిరోష పెద్దగా ప్రాదాన్యం లేని పాత్రలో నటించింది. ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఒకప్పుడు లవర్ బాయ్‌గా ఆకట్టుకున్న వరుణ్ సందేశ్ ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. అమెరికాలో సూరికి సాయపడే పాత్రలో వరుణ్ బాగానే నటించాడు. ఇతర నటీనటులు తమ పాత్రలో పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు సుధాకర్ కోమాకుల యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్నీ ఉన్న కథనే ఎంచుకున్నాడు. అయితే ఆ కథను వెండితెర మీదకు తీసుకురావటంతో దర్శకుడు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. తొలి భాగం అంతా అసలు కథలోకి వెళ్లకుండా హీరో హీరోయిన్ల మధ్య లవ్ సన్నివేశాలు, హీరో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే సీన్స్‌తో నడిపించేశాడు దర్శకుడు. అయితే లవ్ సీన్స్ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో ఫస్ట్ హాఫ్ బోరింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో అసలు కథ మొదలవ్వటంతో కథ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కంటతడిపెట్టిస్తాయి. అయితే అదే స్థాయిలో కథను నడిపించటంలో దర్శకుడు తడబడ్డాడు. హీరో జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా దేన్ని అంత గ్రిప్పింగా చూపించలేకపోయాడు. ఒక్క హీరో పాత్ర తప్ప మరే పాత్ర బలంగా లేకపోవటం కూడా నిరాశకలిగిస్తుంది. సెకండ్ హాఫ్లోనూ కొన్ని అనవసర సన్నివేశాలు విసిగిస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సాగటం కూడా మైనస్సే. సురేష్ బొబ్బిలి, పీఏ దీపక్‌ల సంగీతం పరవాలేదు. అజ్జు మహంకాళి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ప్రకాష్ వేలాయుధన్, వెంకట్ సీ దిలీప్‌ల సినిమాటోగ్రపి బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథ కొన్ని డైలాగ్స్ కొన్ని ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ క్యారెక్టరైజేషన్స్ బలమైన ప్రతినాయకుడు లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
అది ఫిల్మ్ స్కూల్.. ఇది వర్క్‌షాప్
‘‘దర్శకులు శేఖర్ కమ్ములగారి ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నాగరాజు క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పటికీ నన్ను కొందరు నాగరాజు అనే పిలుస్తున్నారు’’ అన్నారు సుధాకర్ కోమాకుల. హరినాథ్ బాబు. బి దర్శకత్వంలో సుధాకర్ కోమాకుల, నిత్యా శెట్టి జంటగా డి. శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘నువ్వు తోపురా’. జేమ్స్ వాట్ సహ–నిర్మాత. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ– ‘‘మాది వైజాగ్. పీజీ పూర్తి చేశాను. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమా తర్వాత ‘ఉందిలే మంచి కాలం, కుందనపు బొమ్మ’ సినిమాల్లో నటించాను. ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల స్పందన లభించలేదు. ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న ‘నువ్వు తోపురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇందులో సరూర్‌నగర్ సూర్య అనే క్యారెక్టర్ చేశాను. మంచి పెయిన్ ఉన్న క్యారెక్టర్. గల్లీల్లో అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు అమెరికా వెళ్తాడు. అక్కడ ఎలాంటి అనుభవాలు, పరిస్థితులు ఎదుర్కొన్నాడు? వాటి వల్ల అతనిలో వచ్చిన మార్పు ఏంటి? అన్న అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే హీరోకి, అతని తల్లికి మధ్య సన్నివేశాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. ఈ సినిమా దర్శకుడు హరినాథ్‌తో నాకు ముందు నుంచే పరిచయం ఉంది. ఇంతకుముందు రెండు కథలు విన్నాను కానీ మా కాంబినేషన్లో సినిమా కుదర్లేదు. ఇప్పటికి కుదిరింది. అమెరికాలో దాదాపు రెండు నెలలు షూటింగ్ చేశాం. డి. శ్రీకాంత్, జేమ్స్‌వాట్ దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. ఈ సినిమాకు నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వర్క్ చేశాను. ‘లైఫ్ ఈజ్ బ్యూటీపుల్’ ఫిల్మ్ స్కూల్లా అనిపిస్తే.. ఈ సినిమా వర్క్షాప్లా అనిపించింది. ఆడియన్స్‌తో ‘నువ్వు తోపురా’ అనిపించుకోవాలన్నదే హీరో తపన. అలాగే ఈ సినిమాలో ఓ సర్ప్రైజ్ క్యారెక్టర్ ఉంది’’ అని అన్నారు. ఇంకా సుధాకర్ మాట్లాడుతూ– ‘‘మంగళగిరిలో మా టీమ్ రోడ్డు ప్రమాదానికి గురవడం నాకు చాలా బాధ కలిగించింది. కారు నడిపింది నేను కాదు. ఈ దురదృష్టకర సంఘటనలో మరణించిన లక్ష్మీ కుటుంబానికి ఐదులక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించాలని టీమ్ నిర్ణయించింది’’ అ ని చెప్పుకొచ్చారు. -
కారు నడిపింది నేను కాదు
సుధాకర్ కోమాకుల, నిత్యాశెట్టి జంటగా హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నువ్వు తోపురా’. డి. శ్రీకాంత్ నిర్మించిన ఈ సినిమా మే 3న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా శనివారం గుంటూరు వెళుతుండగా చిత్రబృందం ప్రయాణిస్తున్న కారు మంగళగిరి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుధాకర్ కోమాకులతో పాటు యూనిట్ సభ్యులు గాయాలపాలయ్యారు. వీరి కారు ఢీకొని ఓ కార్మికురాలు మృతి చెందారు. ఈ ప్రమాదం గురించి హరినాథ్‌బాబు మాట్లాడుతూ– ‘‘భగవంతుడి ఆశీస్సుల వల్లే క్షేమంగా బయటపడ్డాం. సీటు బెల్టే మమ్మల్ని రక్షించింది. మా తప్పిదం లేకపోయినా ఓ నిండు ప్రాణం పోవడం కలచివేసింది. ప్రమాదంలో మరణించిన లక్ష్మి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తాం’’ అన్నారు. ‘‘నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు. ఇంకా షాక్‌లోనే ఉన్నాను. కారులో నేను ప్యాసింజర్ సీటులో కూర్చున్నాను. అనుకోకుండా మా కారు ట్రాక్టర్‌ను ఢీ కొనడంతో నా చేతులతో పాటు తలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారును నేనే డ్రైవ్ చేశానంటూ కొందరు అసత్య వార్తలు రాశారు. దీంతో అమెరికాలో ఉన్న నా భార్య బాధపడింది. ఇలాంటి వార్తలతో మా కుటుంబాల్ని ఇబ్బంది పెట్టొద్దు’’ అన్నారు సుధాకర్. సహనిర్మాత జేమ్స్ వాట్ కొమ్ము, హీరోయిన్ నిత్యాశెట్టి, నిర్మాత శ్రీకాంత్ పాల్గొన్నారు. -
సినీ హీరో కారు ఢీకొని మహిళ మృతి
మంగళగిరి: తెలుగు సినిమా పరిశ్రమ వర్ధమాన కథానాయకుడు సుధాకర్ కోమాకుల కారు ఢీ కొని ఓ మహిళ మృతి చెందింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఆత్మకూరు జాతీయ రహదారిపై శనివారం ఈ ఘటన జరిగింది. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం సుధాకర్ తన కొత్త సినిమా ‘‘నువ్వు తోపురా’’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ నిత్యాషెట్టితో కలిసి గుంటూరులోని ఓ ప్రైవేటు కళాశాలకు కారులో వెళ్తున్నాడు. మరికొద్ది సేపట్లో గుంటూరు చేరుకుంటారనగా వేగంగా వెళ్తున్న కారు.. జాతీయ రహదారి డివైడర్లపై మొక్కల సంరక్షణ పనిచేసే చినకాకాని గ్రామానికి చెందిన మహిళ జలసూత్రం లక్ష్మి (36)ని ఢీ కొట్టింది. ఆ వేగానికి ఎగిరిపడ్డ లక్ష్మి సమీపంలో ఉన్న ట్రాక్టర్‌కు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. డివైడర్‌లో నాటేందుకు ట్రాక్టర్లో మొక్కలు తీసుకురాగా లక్ష్మి ఎర్ర జెండా పట్టుకుని అటుగా వచ్చే వాహనాలకు సిగ్నల్ ఇస్తోంది. ఆ సిగ్నల్‌ను గుర్తించకుండా వేగంగా కారు రావడంతో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను కూడా ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. సీటు బెల్టు పెట్టుకోని డ్రైవర్ సుందరరావుకు తీవ్ర గాయాలవగా పక్క సీట్లో సీటు బెల్టు పెట్టుకుని కూర్చున్న హీరో సుధాకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కారులో వెనుక ఉన్న హీరోయిన్ నిత్యాషెట్టి ప్రమాదం తర్వాత అక్కడి నుంచే తిరిగి వెళ్లిపోయింది. స్థానికులు లక్ష్మి మృతదేహంతో పాటు డ్రైవర్, హీరో సుధాకర్‌లను ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి మృతి వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఎన్ఆర్ఐ ఆసుపత్రికి చేరుకుని భోరున విలపించారు. ముఠా కూలి పని చేసే లక్ష్మి భర్త.. తమకు పుట్టిన కుమారుడితో పాటు మరో అనాథను లక్ష్మి పెంచుతోందని, వారికి దిక్కెవరంటూ విలపించడం అక్కడున్న వారిని కలిచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మంగళగిరి రూరల్, పట్టణ సీఐలు శరత్‌బాబు, రవిబాబు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
నువ్వు మాస్‌రా...
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన చిత్రం ‘నువ్వు తోపురా’. హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో బేబి జాహ్నవి సమర్పణలో యునైటెడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఎస్.జె.కె.ప్రొడక్షన్స్ (యు.ఎస్.ఎ) వారి సహకారంతో డి.శ్రీకాంత్ నిర్మించారు. గీతా ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది. బి.హరినాథ్ మాట్లాడుతూ– ‘‘మాస్, థ్రిల్లర్ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రం గీతా ఆర్ట్స్, జి3 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా విడుదలవుతుండం ఆనందంగా ఉంది. ఇందుకు అల్లు అరవింద్‌గారికి, ‘బన్ని’ వాసుగారికి థ్యాంక్స్’’ అన్నారు శ్రీకాంత్. ‘‘అమెరికాలోని అత్యంత అందమైన ప్రదేశాలైన సాల్ట్ లేక్ సిటీ, ప్రొవో తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. మంచి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం’’ అని చిత్ర సహ నిర్మాత డా.జేమ్స్ వాట్ కొమ్ము(యు.ఎస్.ఎ) అన్నారు. నిత్యాశెట్టి, నిరోషా, రవివర్మ, శ్రీధరన్, దివ్యా రెడ్డి, ‘జెమిని’ సురేష్, దువ్వాసి మోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్: రితేష్ కుమార్, కెమెరా: ప్రశాష్ వేళాయుధన్, వెంకట్ సి.దిలీప్, సంగీతం: సురేష్ బొబ్బలి, ఆమెరికా లైన్ ప్రొడ్యూసర్: స్టెపెనీ ఒల్లర్టన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవివర్మ దంతులూరి. -
ఆ ఫొటోషూట్ వల్ల చాన్స్ వచ్చింది
‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాకి నేను ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు సుధాకర్ నన్ను బాగా రిసీవ్ చేసుకొని సపోర్ట్ చేసాడు. అతను చేసిన ఫొటోషూట్ స్టిల్స్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాకి నాకు ఛాన్స్ రావడానికి కారణం. ‘నువ్వు తోపురా’ మూవీ లైన్ విన్నప్పుడే పెద్ద హిట్ అనే ఫీలింగ్ కలిగింది. ట్రైలర్ చాలా బాగుంది. టికెట్స్ కొని మా ఫ్యామిలీతో ఈ సినిమా చూస్తా’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. సుధాకర్ కోమాకుల, నిత్యా శెట్టి జంటగా నిరోషా ముఖ్య పాత్రలో హరినాథ్ బాబు బి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నువ్వు తోపురా’. బేబీ జాహ్నవి సమర్పణలో డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని విజయ్ దేవరకొండ విడుదల చేశారు. హీరో సుధాకర్ మాట్లాడుతూ– ‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా తర్వాత చాలా అవకాశాలొచ్చినా కొన్ని కారణాల వల్ల చేయలేదు. యారొగెంట్‌గా ఉండే ఓ కుర్రాడు అమెరికా వెళ్లి జీవితంలో ఎలా ఎదిగాడు అన్నది మెయిన్ స్టోరీ’’ అన్నారు. ‘‘కృష్ణవంశీ, వైవీఎస్ చౌదరిగార్ల వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసాను. నా తొలి సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు’’ అన్నారు హరినాథ్ బాబు. ‘‘ప్రతి మనిషి జీవితంలో జరిగిన స్టోరీ ఇది’’ అన్నారు నిర్మాత డి.శ్రీకాంత్. ‘‘12 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో నటిస్తున్నాను. పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలిగింది’’ అన్నారు నటి నిరోషా. చిత్ర కథానాయిక నిత్యా శెట్టి పాల్గొన్నారు. -
ఈడ బతకాలంటే తోడేళ్ల లెక్కుండాలె!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’లో నాగరాజు పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రలో సుధాకర్ తెలంగాణ యాసలో మాట్లాడి నాచురల్‌గా యాక్ట్ చేశాడు. సుధాకర్ ప్రస్తుతం హీరోగా వస్తోన్న చిత్రం ‘నువ్వు తోపురా’. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘ప్రతీ మగాడికి దురదుంటది..కానీ ఒక్క అమ్మాయిని చూసిన తరువాత ఆగిపోతుంది’, ‘మేకలు ఎక్కువగా ఉంటే.. శాకాహారికి కూడా మాంసం తినాలనిపిస్తది. ఈడ బతకాలంటే తోడేళ్ల లెక్కుండాలె’ వంటి డైలాగ్‌లు వైరల్ అవుతున్నాయి. యునైటెడ్ ఫిలిమ్స్‌పై శ్రీకాంత్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హరినాథ్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నిత్యా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. -
'నువ్వు తోపురా' ఫస్ట్ లుక్
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాకర్ కొంత విరామం తరువాత మళ్లీ వెండితెరపై కనువిందు చేసేందుకు రెడీ అయ్యాడు. హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న నువ్వు తోపురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సుధాకర్ కోమాకుల డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. సుధాకర్ కోమాకుల సరసన నిత్యా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం(జూన్ 2) విడుదల చేసారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'సుధాకర్ కోమాకుల, నిత్యాశెట్టిలు జంటగా రూపొందుతున్న 'నువ్వు తోపురా' సినిమాను 70% అమెరికాలో షూట్ చేసేందుకు ప్లాం చేస్తున్నాం. 30% ఇండియాలో షూట్ చేస్తాం. మొదటి షెడ్యూల్ మే 23న మొదలయింది. తర్వాతి షెడ్యుల్ అమెరికాలో ప్రారంభంకానుంది. హాలీవుడ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను జూన్ 9న విడుదల చేయనున్నాం' అని తెలిపారు. -
విలేజ్‌లో క్రేజీ లవ్
‘లైఫ్ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం సుధాకర్ కోమాకుల, సుధీర్ వర్మ, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కుందనపు బొమ్మ’. కె.రాఘవేంద్రరావు సమర్పణలో ముళ్లపూడి వరా దర్శకత్వంలో జి. అనిల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణ, నిరంజన్ నిర్మించారు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ-‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఈ చిత్రం చూసిన మాగ్నస్ సినీ ప్రైమ్ అధినేత శ్రీనివాస్ బొగ్గరంగారు సినిమా విడుదల చేసేందుకు ముందుకొచ్చారు’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర నిడివి తక్కువగా ఉన్నా, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది’’ అని సుధాకర్ కొమాకుల అన్నారు. నిర్మాతల్లో ఒక్కరైన వంశీ మాట్లాడుతూ- ‘‘కుందనపు బొమ్మ లాంటి హీరోయిన్‌కు వచ్చిన సమస్యలు ఏంటి? వాటిని ఎవరు పరిష్కరించగలిగారు? అన్నదే కథ’’ అన్నారు. నటుడు సుధీర్‌వర్మ, మాటల రచయిత్రి అనురాధ ఉమర్జీ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎంఎస్ శ్రీనివాస్, సహ నిర్మాతలు: ఎన్. నరసరాజు, అనిత. -
మాది పెద్దలు అనుమతించిన ప్రేమ వివాహం!
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో బోల్డన్ని పాత్రలుంటాయి. వాటిల్లో బాగా గుర్తుండిపోయిన పాత్ర... నాగరాజు. ఈ పాత్ర పోషించిన సుధాకర్ కోమాకులను చాలామంది నాగరాజు అనే పిలుస్తారు. అంత పేరొచ్చింది కాబట్టే, తదుపరి చిత్రంలోని పాత్ర కూడా బాగుండాలనే ఆకాంక్షతో ఎన్నో కథలు విని, చివరికి ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’కి సుధాకర్ పచ్చజెండా ఊపారు. అరుణ్ దాస్యం దర్శకత్వంలో రవి రాష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సుధాకర్ మనోభావాలు ఈ విధంగా... ఈ చిత్రంలో నా పాత్ర పేరు జాజ్రాజ్. పెద్ద రాక్‌స్టార్ కావాలనేది ఆశయం. పగలంతా ఆటో నడిపి, సాయంత్రం నుంచి ఈవెంట్స్‌లో పాల్గొంటాను. మా అమ్మ ఈవెంట్ లక్ష్మీగా రాధికగారు నటించారు. నాన్నగా నరేశ్‌గారు చేశారు. వినోద ప్రధానంగా సాగే విలువలున్న చిత్రం ఇది. బేసిక్‌గా నాకు ఆర్ట్ అంటే ఇష్టం. అది డాన్స్, ఫొటోగ్రఫీ.. ఇలా ఏదైనా. అందుకే, సెంట్రల్ యూనివర్శిటీలో పీజీ డిప్లొమా ఇన్ డాన్స్ చేశాను. ఫొటోగ్రఫీ మీద ఇష్టంతో అది కూడా నేర్చుకున్నాను. ఈ చిత్రదర్శకుడు అరుణ్, నేను స్కూల్ ఫ్రెండ్స్. నేను ఫొటోగ్రఫీ చేయడానికి యూఎస్ వెళ్లిపోయాను. అరుణేమో ఇక్కడ అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసేవాడు. శేఖర్ కమ్ములగారు నన్ను యూఎస్ నుంచి పిలిపించి, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో మంచి పాత్ర ఇచ్చారు. ఆ సమయంలోనే అరుణ్ ఈ సినిమా అనుకున్నాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత కరెక్ట్ సినిమా చేశాననిపించింది. అది అదృష్టమో దురదృష్టమో చెప్పలేను కానీ హుద్ హుద్ ముందు సుందర నగరం వైజాగ్‌ని అద్భుతంగా చూపించిన చివరి చిత్రం మాదే అవుతుంది. ఈ సినిమా కోసం వైజాగ్‌లో కీలక సన్నివేశాలు తీశాం. ఆ తర్వాత హుద్ హుద్ రావడం, వైజాగ్ పరిస్థితి దారుణంగా మారడం తెలిసిందే. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో నన్నందరూ తమ ఇంటి అబ్బాయి అనుకుంటున్నారు. ఒకే రకం కాకుండా వినూత్న తరహా పాత్రలు చేయాలన్నది నా కోరిక. ముఖ్యంగా స్పోర్ట్స్మేన్గా చేయాలనే ఆకాంక్ష ఉంది. అలాగే, కథకు కీలకంగా ఉంటే.. నెగటివ్ రోల్ అయినా చేస్తాను. నేనీ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా అమ్మా, నాన్న. ఆ తర్వాత నా భార్య హారిక. నాకు మంచి సినీ జీవితాన్నిచ్చిన శేఖర్ కమ్ములగారు. ఆయన్ను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు పెళ్లయిన విషయం చాలామందికి తెలీదు. మాది పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం. మై వైఫ్ ఈజ్ సో బెస్ట్. -
సిల్వెస్టర్ స్టాలిన్ ఇంట్లో షూటింగ్...
సాయంత్రం ఆరు నుంచి మర్నాడు ఉదయం ఆరు గంటల లోపు జరిగే సంఘటనల సమాహారంతో రూపొందిన చిత్రం ‘హ్యాంగ్ అప్’. సుధాకర్ కొమాకుల, నటాలియా రౌత్, మహేష్ శ్రీరామ్ ముఖ్య తారలుగా హైదర్ బిల్ గ్రామి, తీర్థంకర్ దాస్ దర్శకత్వం వహించారు. ఫరూక్ దర్వాలా లైన్ ప్రొడ్యూసర్. ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేయనున్నామని హైదర్ బిల్ చెబుతూ -‘‘హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలిన్ స్వగృహంలో ఈ సినిమా షూటింగ్ చేశాం. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందించినప్పటికీ ముందు తెలుగులో ఆ తర్వాత మూడు నెలలకు హిందీలో రిలీజ్ చేస్తాం’’ అని చెప్పారు. సుధాకర్ మాట్లాడుతూ -‘‘ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కి ముందే ఈ సినిమా అంగీకరించా. థ్రిల్లర్ జానర్లో సాగే సినిమా. ఒక్క రోజులో జరిగే కథ కోసం 40 రాత్రులు షూటింగ్ చేశాం. ఆ ఒక్క రాత్రి ఏం జరిగింది? అనేది ఆసక్తికరమైన విషయం’’ అన్నారు.బేసికల్‌గా క్లాసికల్ డాన్సర్‌ని అని, కేంబ్రిడ్జ్లోనే మెడిసన్ చదువుకున్నానని, యూఎస్‌లోనే ఈ సినిమా తీయడం వల్ల యాక్ట్ చేయగలిగానని, తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తే చేస్తానని నటాలియా తెలిపారు. -
లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్...
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం సుధాకర్ కొమాకుల, నాట్లీ, ఏంజలీ కుమార్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘హాంగ్ అప్’. ఈ చిత్రానికి తీర్థాంకర్ దాస్ దర్శకత్వం వహిస్తూ, హైదర్ బిల్గ్రామితో కలిసి నిర్మిస్తున్నారు. దాస్, శ్యామ్వయ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆర్పీ పట్నాయక్ ఆడియో సీడీని ఆవిష్కరించి, జయంత్ సి.పరాన్జీకి అందించారు. టి.ప్రసన్నకుమార్ ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌లో సౌండ్ డిజైనింగ్ కొత్తగా ఉంటుందని, తెలుగులో హాలీవుడ్ సినిమా చూసిన ఫీల్‌ని కలిగించే సినిమా ఇదని సుధాకర్ చెప్పారు.