విలేజ్‌లో క్రేజీ లవ్ | Village in Crazy Love | Sakshi
Sakshi News home page

విలేజ్‌లో క్రేజీ లవ్

Jun 5 2016 1:59 AM | Updated on Sep 4 2017 1:40 AM

విలేజ్‌లో క్రేజీ లవ్

విలేజ్‌లో క్రేజీ లవ్

‘లైఫ్‌ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం సుధాకర్ కోమాకుల, సుధీర్ వర్మ, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కుందనపు బొమ్మ’.

‘లైఫ్‌ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం సుధాకర్ కోమాకుల, సుధీర్ వర్మ, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కుందనపు బొమ్మ’. కె.రాఘవేంద్రరావు సమర్పణలో ముళ్లపూడి వరా దర్శకత్వంలో జి. అనిల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణ, నిరంజన్ నిర్మించారు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ-‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఈ చిత్రం చూసిన మాగ్నస్ సినీ ప్రైమ్ అధినేత శ్రీనివాస్ బొగ్గరంగారు సినిమా విడుదల చేసేందుకు ముందుకొచ్చారు’’ అని చెప్పారు.

‘‘ఈ చిత్రంలో నా పాత్ర నిడివి తక్కువగా ఉన్నా, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది’’ అని సుధాకర్ కొమాకుల అన్నారు. నిర్మాతల్లో ఒక్కరైన వంశీ మాట్లాడుతూ- ‘‘కుందనపు బొమ్మ లాంటి హీరోయిన్‌కు వచ్చిన సమస్యలు ఏంటి? వాటిని ఎవరు పరిష్కరించగలిగారు? అన్నదే కథ’’ అన్నారు. నటుడు సుధీర్‌వర్మ, మాటల రచయిత్రి అనురాధ ఉమర్జీ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్‌ఎమ్ కీరవాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎంఎస్ శ్రీనివాస్, సహ నిర్మాతలు: ఎన్. నరసరాజు, అనిత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement