Kundanapu Bomma
-
విలేజ్‌లో క్రేజీ లవ్
‘లైఫ్ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం సుధాకర్ కోమాకుల, సుధీర్ వర్మ, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కుందనపు బొమ్మ’. కె.రాఘవేంద్రరావు సమర్పణలో ముళ్లపూడి వరా దర్శకత్వంలో జి. అనిల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణ, నిరంజన్ నిర్మించారు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ-‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఈ చిత్రం చూసిన మాగ్నస్ సినీ ప్రైమ్ అధినేత శ్రీనివాస్ బొగ్గరంగారు సినిమా విడుదల చేసేందుకు ముందుకొచ్చారు’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర నిడివి తక్కువగా ఉన్నా, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది’’ అని సుధాకర్ కొమాకుల అన్నారు. నిర్మాతల్లో ఒక్కరైన వంశీ మాట్లాడుతూ- ‘‘కుందనపు బొమ్మ లాంటి హీరోయిన్‌కు వచ్చిన సమస్యలు ఏంటి? వాటిని ఎవరు పరిష్కరించగలిగారు? అన్నదే కథ’’ అన్నారు. నటుడు సుధీర్‌వర్మ, మాటల రచయిత్రి అనురాధ ఉమర్జీ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎంఎస్ శ్రీనివాస్, సహ నిర్మాతలు: ఎన్. నరసరాజు, అనిత. -
బాపు, రమణల గీత, రాత కనిపిస్తాయి
- కె. రాఘవేంద్రరావు ‘‘ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. ఈ సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అని సీనియర్ దర్శకుడు కె. విశ్వనాథ్ ఆకాంక్షించారు. సుధాకర్ కోమాకుల, సుధీర్ వర్మ, చాందినీ చౌదరి ముఖ్యతారలుగా కె. రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్.ఎల్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ముళ్లపూడి వరా దర్శకత్వంలో జి.అనిల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణ నిర్మించిన చిత్రం ‘కుందనపు బొమ్మ’. ఎమ్.ఎమ్. కీరవాణి స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. కీరవాణి ఈ చిత్రం పాటలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ‘‘బాపు గారి గీత, రమణ గారి రాత ఈ చిత్రంలో కనిపిస్తాయి. అచ్చమైన తెలుగు టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ - ‘‘నేను రాఘవేంద్రరావు గారి దగ్గర సహాయ దర్శకునిగా చేరినప్పుడు వరా గారితో నాకు పరిచయం ఏర్పడింది. ఈ సినిమా ట్రైలర్ చూడగానే, వెంటనే సినిమా చూడాలనిపిస్తోంది’’ అన్నారు. వరా ముళ్లపూడి మాట్లాడుతూ - ‘‘ఈ స్క్రిప్ట్ రాయడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. కీరవాణి గారైతే కథ వినకుండా కేవలం సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. ఈ వేడుకలో రచయితలు శివశక్తి దత్తా, అనంత శ్రీరామ్, దర్శకులు బి. గోపాల్, ప్రవీణ్ సత్తారు తదితరులు పాల్గొన్నారు. -
నిజంగా కుందనపు బొమ్మే!
అందమైన పల్లెటూరి ప్రేమకథగా వర ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కుందనపు బొమ్మ’. సుధీర్, చాందినీ చౌదరి జంటగా కె. రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్.ఎల్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జి.అనిల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల మూడో వారంలో పాటలను విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘స్వచ్ఛమైన తెలుగుదనం ఉట్టిపడే కథగా ఈ చిత్రాన్ని వర ముళ్లపూడి తెరకెక్కించారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . ఇందులో కథానాయిక నిజంగా కుందనపు బొమ్మలాగానే ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మల్లాది సత్య శ్రీనివాస్, సహ నిర్మాతలు: నడింపల్లి నరసరాజు, జి.అనితాదేవి. -
బాపు కదిలి వచ్చినట్లనిపించింది!
తెలుగు వారి హృదయాల్లో చెరిగిపోని సంతకం చేసిన మహనీయలు బాపు, రమణ. బాపు దర్శకత్వంతో మాయ చేస్తే, రమణ తన కలంతో పదునైన సంభాషణలు పలికించేవారు. వీరిద్దరి కాంబినేషన్ ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఇప్పుడు వారి కుటుంబం నుంచే ఓ సినిమా రాబోతోంది. ఎస్.ఎల్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ముళ్లపూడి వెంకటరమణ తనయుడు వరా ముళ్లపూడి దర్శకత్వంలో జి. అనిల్‌కుమార్‌రాజు, జి.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘కుందనపు బొమ్మ’. చాందిని చౌదరి కథానాయిక. కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ -‘‘ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమిస్తారు. చివరికి ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది అనేదే కథ’’ అని చెప్పారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ -‘‘బాపు, రమణలు నాకు ఆత్మీయులు. ఈ టైటిల్ వింటుంటే నాకు బాపుగారు కదిలి వచ్చినట్టుంది’’ అని అన్నారు. ‘‘రాఘవేంద్రరావుగారికి 43 కథలు చెప్పాం. ఆయనకు ఏదీ నచ్చలేదు. నేను చెప్పిన 44వ కథ ఇది. పల్లెటూరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రం’’ అని వరా ముళ్లపూడి చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అనురాధ ఉమర్జీ, గౌతమ్ కశ్యప్, కథా విస్తరణ,స్క్రీన్‌ప్లే: కె.కె.వంశీ, శివ తాళ్లూరి, కెమెరా: ఎస్.డి. జాన్.