నిజంగా కుందనపు బొమ్మే! | 'Kundanapu Bomma' shooting completed | Sakshi
Sakshi News home page

నిజంగా కుందనపు బొమ్మే!

Published Sun, May 10 2015 10:57 PM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM

నిజంగా కుందనపు బొమ్మే!

నిజంగా కుందనపు బొమ్మే!

 అందమైన పల్లెటూరి ప్రేమకథగా వర ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కుందనపు బొమ్మ’. సుధీర్, చాందినీ చౌదరి జంటగా  కె. రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్.ఎల్. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జి.అనిల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల మూడో వారంలో పాటలను విడుదల చేయనున్నారు.
 
  నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘స్వచ్ఛమైన తెలుగుదనం ఉట్టిపడే కథగా ఈ చిత్రాన్ని  వర ముళ్లపూడి తెరకెక్కించారు. ముఖ్యంగా కుటుంబ  ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . ఇందులో కథానాయిక నిజంగా కుందనపు బొమ్మలాగానే ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మల్లాది సత్య శ్రీనివాస్, సహ నిర్మాతలు: నడింపల్లి నరసరాజు, జి.అనితాదేవి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement