Chandni Chaudhary
-
సాఫ్ట్వేర్ ఉద్యోగులు వద్దు
పేరు ఓరుగంటి కల్యాణి. ప్రభుత్వోద్యోగి కావాలనే లక్ష్యంతో గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతోంది. అయితే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ తనకు కాబోయే వరుడు ప్రభుత్వోద్యోగి అయ్యుండాలని, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉండకూడదని, వెజిటేరియన్ అయ్యుండాలని ఆశ పడుతుంది కల్యాణి. అంతే కాదండోయ్... సాఫ్ట్వేర్ ఉద్యోగి అసలే వద్దు అంటోంది. మరి... కల్యాణి ఆకాంక్షకు తగ్గ వరుడు దొరికాడా? లేదా అనేది ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో చూడొచ్చు. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఇది. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. బుధవారం (అక్టోబరు 23) చాందినీ చౌదరీ బర్త్ డే సందర్భంగా ‘సంతాన ప్రాప్తిరస్తు’లో ఓరుగంటి కల్యాణి పాత్రలో ఆమె నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం చాలామంది ఫేస్ చేస్తున్న సంతానలేమి సమస్య ఆధారంగా ‘సంతాన ్రపాప్తిరస్తు’ తీస్తున్నాం. రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది’’ అని తెలిపారు మేకర్స్. -
ఈ టీమ్‌ని చూస్తే ముచ్చటేసింది: విశ్వక్ సేన్
‘‘ప్రతిభ ఉన్న యువతకు సీ స్పేస్ అనే సంస్థ ద్వారా మంచి వేదిక సృష్టించాడు నవదీప్. నా తోటి నటీనటుల్లో నేను గౌరవించే వాళ్లలో చాందినీ చౌదరి ఒకరు. తను ఎప్పుడూ టెన్షన్ పడుతుంటుంది. ‘యేవమ్’తో తనకి ఆ భయం పోయింది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. చాందినీ చౌదరి, వశిష్ట సింహా, భరత్ రాజ్, అషు రెడ్డి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘యేవమ్’. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది.ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘యేవమ్’ లాంటి ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రానికి మహిళా సంగీత దర్శకురాలు, మహిళా ఎడిటర్ పని చేయడం హ్యాపీగా ఉంది. ఈ టీమ్‌కి ఈ చిత్రం మంచి బ్రేక్ అవ్వాలి’’ అన్నారు. ‘‘యేవమ్’ చూశాను. ఇంటర్వెల్, పతాక సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి’’ అన్నారు మరో అతిథి, డైరెక్టర్ సందీప్ రాజ్. ‘‘ఈ మూవీలో నాది పోలీస్ పాత్ర అనగానే యాక్షన్ ఓరియంటెడ్ అనుకున్నాను. అయితే యాక్షన్ పాటు అన్ని షేడ్స్ నా పాత్రలో ఉన్నాయి’’ అన్నారు చాందిని. ‘‘మంచి ఇంటెన్స్‌తో నిజాయితీగా చేసిన సినిమా ‘యేవమ్’’ అన్నారు నవదీప్. ‘‘ఇదొక ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్’’ అన్నారు ప్రకాశ్ దంతులూరి. -
Vishwak Sen: అఘోరా అనుకొని ధర్మం చేశారు!
‘‘గామి’ సినిమా షూటింగ్‌ని వారణాసిలోని కుంభమేళాలో జరిపినప్పుడు నేను నిజమైన అఘోరా అనుకొని కొందరు ధర్మం చేశారు. అక్కడ చలికి వణుకుతూ ఓ మూలన కూర్చున్నప్పుడు ఓ వృద్ధురాలు భోజనం పెట్టి, టీ ఇచ్చింది. ‘గామి’ ట్రైలర్ అత్యద్భుతంగా ఉంది. ఈ చిత్రం ప్రేక్షకులకు మునుపెన్నడూ కలిగించని సరికొత్త అనుభూతిని పంచుతుందనే నమ్మకం ఉంది’’ అని విశ్వక్ సేన్ అన్నారు. ఆయన హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గామి’. చాందినీ చౌదరి కథానాయిక. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘గామి’ కోసం దాదాపు నాలుగున్నరేళ్లు పని చేశాం. ఇంత సమయం పట్టింది కాబట్టే మంచి గ్రాఫిక్స్‌ని రాబట్టుకున్నాం’’ అన్నారు. ‘‘మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్య ఎదుర్కొంటున్న అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణమే ఈ చిత్రం. ఈ సినిమా కోసం వారణాసిలో కుంభమేళా షూటింగ్ చేశాం. మైనస్ 40 డిగ్రీల్లో కూడా గ్లౌజులు లేకుండా నటించాడు విశ్వక్’’ అన్నారు విద్యాధర్ కాగిత. ‘‘2018లో ‘గామి’ మొదలుపెట్టాం. క్రౌడ్ ఫండ్ మోడల్లో చేశాం’’ అన్నారు కార్తీక్ శబరీష్. ∙విశ్వక్ సేన్, చాందినీ చౌదరి -
అదే నా ప్లస్ పాయింట్
‘‘మను’ చిత్రంతో నాకు బ్రేక్ వస్తుందా? రాదా? అనేది ఆడియన్స్ జడ్జ్‌మెంట్‌పై, దేవుడి దయపై ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకు నేను ప్రాణం పెట్టి చేశాను. తెలుగు అమ్మాయిని అవ్వడం నాకు ప్లస్ పాయింట్. ఎందుకంటే భాషతో సమస్య ఉండదు’’ అని చాందినీ చౌదరి అన్నారు. రాజా గౌతమ్, చాందినీ చౌదరి జంటగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్మాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చాందినీ చౌదరి చెప్పిన విశేషాలు... ఫణీంద్రగారి ‘మధురం’ అనే షార్ట్ ఫిల్మ్ చేశా. ఆ పరిచయంతో ‘మను’ సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో నీల పాత్ర చేశా. ఈ పాత్ర కోసం దాదాపు ఐదు నెలలు హోం వర్క్ చేశాను. నాకు తెలిసి ఇలాంటి పాత్ర ఇంత వరకూ ఏ సినిమాలో రాలేదు. బడ్జెట్ కంట్రోలింగ్ ఉండటం వల్ల సినిమా కాస్త లేట్ అయ్యింది. అవకాశాలు నా చేతిలో లేవు. నా వరకు నేను పాత్ర కోసం ఎంతైనా కష్టపడతాను. ప్రస్తుతానికి హీరోయిన్‌గానే చేయాలనుకుంటున్నా. ఒక మంచి నటిగా ఇండస్ట్రీలో పేరొస్తే చాలు. ∙హీరో గౌతమ్ ‘మను’ అనే లోకల్ ఆర్టిస్టు క్యారెక్టర్లో నటించారు. నీల పాత్రలో బాగా డెప్త్ ఉంటుంది. ఈ సినిమాలో చాలా సీన్స్‌ను నేచురల్‌గా తీశాం. కొన్ని సీన్స్‌కు గ్లిజరిన్ కూడా వాడలేదు. ప్రతిదీ ఫర్ఫెక్ట్గా ఉండాలని ఫణీంద్రగారు కోరుకుంటారు. అందుకే టైమ్ గురించి ఆలోచించలేదు. ∙ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పలేను. ఎందుకంటే చాలా వార్తలు వస్తున్నాయి. నా వరకు అలాంటివి ఎదురవలేదు. మా సినిమాతో పాటు ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా రిలీజ్ అవుతోంది. రెండు సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నా. నెక్ట్స్ సినిమా గురించి ఇంకా కమిట్ కాలేదు. ఈ సినిమా రిజల్ట్ బట్టి ఉంటుంది. మంచి కథ ఉంటే ఇతర భాషల్లో నటించడానికి సిద్ధమే. -
నిజంగా కుందనపు బొమ్మే!
అందమైన పల్లెటూరి ప్రేమకథగా వర ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కుందనపు బొమ్మ’. సుధీర్, చాందినీ చౌదరి జంటగా కె. రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్.ఎల్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జి.అనిల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల మూడో వారంలో పాటలను విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘స్వచ్ఛమైన తెలుగుదనం ఉట్టిపడే కథగా ఈ చిత్రాన్ని వర ముళ్లపూడి తెరకెక్కించారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . ఇందులో కథానాయిక నిజంగా కుందనపు బొమ్మలాగానే ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మల్లాది సత్య శ్రీనివాస్, సహ నిర్మాతలు: నడింపల్లి నరసరాజు, జి.అనితాదేవి. -
పైలట్ అవుతా...
బొబ్బిలి: ఇంజినీరింగ్ చేస్తూ సరదాగా షార్ట ఫిల్మ్ ఫిల్మ్‌లో నటిస్తే సినిమాలో ఛాన్స వచ్చిందని చెబుతోంది కొత్త హీరోయిన్ చాందినీ చౌదరి. సిని మాల్లో నటించకముందే షార్ట ఫిల్మ్స్‌తో పాపులర్ అయిన చాందిని మొదటిసారిగా ఓ సినిమాలో హీరోయిన్గా తెరంగేట్రం చేస్తోంది. ముళ్ల పూడి వర దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది. స్థానిక కిర్లంపూడి ప్యాలెస్‌లో జరుగుతున్న షూటింగ్ విరామ సమయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తన స్వస్థ లం విశాఖ అని, అక్కడే విద్యాభ్యాసమంతా పూర్తయ్యిందని చాందిని తెలిపారు. విశాఖలోని సెక్టార్ 8లోని శ్రీ సత్యసాయి విద్యా విహార్‌లో ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకూ చదివానన్నారు. తనకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఎంతో ఇష్టమని, ఆ రంగంలోనే ఉన్నత స్థాయికి వెళతానని అనుకునేదాన్నని చెప్పారు. బెంగళూరులో మెకానిక్ల్ ఇంజినీరింగు చేస్తుండగా మధ్య మధ్యలో సెలవులకు విశాఖ వచ్చినపుడు షార్ట్ఫి ల్మ్లు తీయడానికి స్నేహితులు ఆహ్వానించడంతో ఈ రంగంలోకి వచ్చానని తెలిపారు. అలా ఆరు షార్ట్పి ల్మ్లు తీసి యూట్యూబ్‌లో పెట్టారన్నారు. దీంతో చాలా గుర్తింపు వచ్చిందని చెప్పారు. అలాగే అలాగే మధురిమ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్‌కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని తెలిపారు. 2012 నుంచి సిని మాల్లో అవకాశాలు వస్తున్నా ఇంజినీరింగ్ మధ్యలో వదల్లేక అంగీకరించలేదన్నారు. గత ఏడాది ఆగస్టులో చదువు పూర్తవ్వడంతో సినిమాలు చేస్తున్నానని చెప్పారు. మొత్తం ఈ ఏడాదిలో నాలుగు సిని మాలు చేయనున్నట్లు తెలిపారు. హీరోల్లో రజనీకాంత్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. అలాగే హీరోయిన్స్‌లో శ్రీదేవి, రమ్యకృష్ణ, సౌందర్య, ప్రియాంక చోప్రాలంటే ఇష్టమని, ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క రకమైన అంశాలు నేర్చుకుంటున్నానని చెప్పారు. నటనతో పాటు ఇతర వ్యాపకాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇతర వ్యాపకాలు రెండేళ్ల పాటు ఫ్రెంచి భాషను నేర్చుకున్నానని, కన్నడ, హిందీ భాషల్లో కూడా మంచి పట్టుందన్నారు. సమయం దొరికితే పుస్తకాలు చదువుతానని, భరతనాట్యంలో ప్రావీణ్యత ఉందని తెలిపారు. నటనతో పాటు వీటినీ ఎంతో ఇష్టపడతానని ఆమె అన్నారు. ఎప్పటికైనా పైలట్ కావాలనేదే తన కోరికని చాందిని తెలిపారు. అలాగే ఎంబీఏ కోసం విదేశాలకు వెళ్తానని తెలిపారు.