పైలట్ అవుతా...
బొబ్బిలి: ఇంజినీరింగ్ చేస్తూ సరదాగా షార్ట ఫిల్మ్ ఫిల్మ్‌లో నటిస్తే సినిమాలో ఛాన్‌స వచ్చిందని చెబుతోంది కొత్త హీరోయిన్ చాందినీ చౌదరి. సిని మాల్లో నటించకముందే షార్‌ట ఫిల్మ్స్‌తో పాపులర్ అయిన చాందిని మొదటిసారిగా ఓ సినిమాలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తోంది. ముళ్ల పూడి వర దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది. స్థానిక కిర్లంపూడి ప్యాలెస్‌లో జరుగుతున్న షూటింగ్ విరామ సమయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తన స్వస్థ లం విశాఖ అని, అక్కడే విద్యాభ్యాసమంతా పూర్తయ్యిందని చాందిని తెలిపారు. విశాఖలోని సెక్టార్ 8లోని శ్రీ సత్యసాయి విద్యా విహార్‌లో ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకూ చదివానన్నారు. తనకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఎంతో ఇష్టమని, ఆ రంగంలోనే ఉన్నత స్థాయికి వెళతానని అనుకునేదాన్నని చెప్పారు.
బెంగళూరులో మెకానిక్‌ల్ ఇంజినీరింగు చేస్తుండగా మధ్య మధ్యలో సెలవులకు విశాఖ వచ్చినపుడు షార్ట్‌ఫి ల్మ్‌లు తీయడానికి స్నేహితులు ఆహ్వానించడంతో ఈ రంగంలోకి వచ్చానని తెలిపారు. అలా ఆరు షార్ట్‌పి ల్మ్‌లు తీసి యూట్యూబ్‌లో పెట్టారన్నారు. దీంతో చాలా గుర్తింపు వచ్చిందని చెప్పారు. అలాగే అలాగే మధురిమ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్‌కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని తెలిపారు. 2012 నుంచి సిని మాల్లో అవకాశాలు వస్తున్నా ఇంజినీరింగ్ మధ్యలో వదల్లేక అంగీకరించలేదన్నారు.
గత ఏడాది ఆగస్టులో చదువు పూర్తవ్వడంతో సినిమాలు చేస్తున్నానని చెప్పారు. మొత్తం ఈ ఏడాదిలో నాలుగు సిని మాలు చేయనున్నట్లు తెలిపారు. హీరోల్లో రజనీకాంత్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. అలాగే హీరోయిన్స్‌లో శ్రీదేవి, రమ్యకృష్ణ, సౌందర్య, ప్రియాంక చోప్రాలంటే ఇష్టమని, ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క రకమైన అంశాలు నేర్చుకుంటున్నానని చెప్పారు. నటనతో పాటు ఇతర వ్యాపకాలు కూడా ఉన్నాయని చెప్పారు.
ఇతర వ్యాపకాలు
రెండేళ్ల పాటు ఫ్రెంచి భాషను నేర్చుకున్నానని, కన్నడ, హిందీ భాషల్లో కూడా మంచి పట్టుందన్నారు. సమయం దొరికితే పుస్తకాలు చదువుతానని, భరతనాట్యంలో ప్రావీణ్యత ఉందని తెలిపారు. నటనతో పాటు వీటినీ ఎంతో ఇష్టపడతానని ఆమె అన్నారు. ఎప్పటికైనా పైలట్ కావాలనేదే తన కోరికని చాందిని తెలిపారు. అలాగే ఎంబీఏ కోసం విదేశాలకు వెళ్తానని తెలిపారు.