‘‘నారాయణ అండ్ కో’ కథని డైరెక్టర్ చిన్నా చెప్పినప్పుడు గమ్మత్తుగా అనిపించింది. ఫ్యామిలీ అండ్ క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకునేలా
ఉంటుంది’’ అని సుధాకర్ కోమాకుల అన్నారు. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘నారాయణ అండ్ కో’. పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కోమాకుల నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలకానుంది.
ఈ సందర్భంగా సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ– ‘‘నాకు నిర్మాణంపై ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. మొదటి నుంచి వీడియోస్, కవర్ సాంగ్స్ చేస్తూనే ఉన్నాను. సినిమా నిర్మాణంలోకి రావాలనుకున్నప్పుడు ‘నారాయణ అండ్ కో’ సరైన సినిమా అనిపించింది. నాకు వినోదం అంటే చాలా ఇష్టం. ఈ మూవీలో పూర్తి స్థాయి వినోదం పంచే పాత్ర చేసే అవకాశం దక్కింది. ఇక పదేళ్లకు పైగా ఉన్న నా సినీ ప్రయాణంలో రావాల్సినంత ఫేమ్ రాలేదు.
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా తర్వాత మరో సోలో చిత్రం పడుంటే నా కెరీర్ తర్వాతి స్థాయికి వెళ్లేది. డైరెక్టర్ అనిల్ రావిపూడి నాకు మంచి స్నేహితుడు. తన సినిమాలో ఓసారి మంచి పాత్ర చేసే అవకాశం వచ్చింది.. కానీ చేయలేక΄ోయాను. నాకు సరైన పాత్ర ఇవ్వాలని అనిల్‌కి కూడా ఉంది. ‘క్రాక్’ సినిమా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చాయి. కానీ, నేనే ఆసక్తి చూపలేదు.. లీడ్ రోల్స్‌పైనే దృష్టి పెట్టాను. ప్రస్తుతం ‘జీడీ’ (గుండెల్లో దమ్ము) సినిమాతో పాటు 1980 నేపథ్యంలో ఒక ప్రేమకథా చిత్రం చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment