Narayana And co Movie
-
ఓటీటీలోకి వచ్చేసిన ‘నారాయణ అండ్ కో’
సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన తాజా చిత్రం నారాయణ అండ్ కో. ‘ది తిక్కల్ ఫ్యామిలీ'అనేది ట్యాగ్ లైన్. జూన్ 30న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మూవీ కాన్సెప్ట్ బాగా ఉందని ప్రశంసలు వచ్చినా ప్రమోషన్లు సరిగా లేకపోవడంతో మూవీ పెద్దగా ఆడలేకపోయింది. దీనికి తోడు ఆ సమయంలో థియేటర్లలో భారీ సినిమాలు ఉండడంతో పోటీ ముందు నిలబడలేకపోయింది. అయితే ఇప్పుడీ ‘నారాయణ అండ్ కో మూవీ’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ‘నారాయణ అండ్ కో’ కథేంటంటే.. నారాయణ(దేవి ప్రసాద్), జానకి(ఆమని) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. నారాయణ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. పెద్ద కొడుకు ఆనంద్(సుధాకర్ కోమకుల) క్యాబ్ డ్రైవర్. క్రికెట్లో బెట్టింగ్ పెడుతుంటాడు. దీంతో అతనికి రూ.10 లక్షల వరకు అప్పు అవుతుంది. చిన్న కొడుకు సుభాష్ (జై కృష్ణ) కెమెరామెన్. ఓ చావు ఇంటికి ఫోటోలు తీయడానికి వెళ్లి ఓ అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోని పంపి, రూ. 10 లక్షలు ఇవ్వకుంటే ఆది వైరల్ చేస్తానని బెదిరిస్తాడు ఓ అజ్ఞాత వ్యక్తి. మరోవైపు నారాయణ పని చేసే బ్యాంకులో రూ.25 లక్షల దొంగతనం జరుగుంది. అది నారాయణ మీదకు వస్తుంది. రూ.25 లక్షలు తిరిగి ఇవ్వకుంటే పోలీసు కేసు పెడతానని మేనేజర్ బెదిరిస్తాడు. దీంతో నారాయణ ఫ్యామిలీ అంతా డబ్బు కోసం ఎవరినైనా కిడ్నాప్ చేయాలని భావిస్తారు. నారాయణ మేనకోడలు నళిని(పూజా కిరణ్)తో కలిసి కిడ్నాప్‌కి ప్లాన్ చేస్తే వర్కౌట్ కాదు. ఇదే సమయంలో వారికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రౌడీ శంకర్(తోటపల్లి మధు) తరపున ఓ డీల్ వస్తుంది. ముంబైకి వెళ్లి ఓ పిల్లి బొమ్మను తీసుకువస్తే.. రూ. కోటి ఇస్తామని ఆఫర్ ఇస్తారు. దీంతో నారాయణ ఫ్యామిలీ వెంటనే ఆ డీల్ ఒప్పుకుంటారు. మరి ఒప్పందం ప్రకారం పిల్లి బొమ్మను నారాయణ& కో తీసుకొచ్చిందా? పిల్లి బొమ్మను తీసుకొచ్చే క్రమంలో నారాయణ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు ఆ పిల్లి బొమ్మలో ఏం ఉంది? బ్యాంకులో డబ్బులు కొట్టేసింది ఎవరు? సుభాష్‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నదెవరు? ఎస్సై అర్జున్(అలీ రెజా) వారిని ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. -
ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమాలు
విజయ్-సమంత నటించిన 'ఖుషి' థియేటర్లలోకి వచ్చేసింది. ఆలోవర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. అయితే ఈ వారం ఓటీటీలో పెద్దగా చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు రిలీజ్ కాలేదు. ఓ డబ్బింగ్ మూవీ, వెబ్ సిరీస్ మాత్రమే విడుదలయ్యాయి. అలాంటిది ఓ రెండు తెలుగు మూవీస్.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? ఎందులో రిలీజ్ అయ్యాయి? ఆ ఓటీటీలో 'ఉస్తాద్' ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా. ఇప్పుడిప్పుడు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్'. ఆగస్టు 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ఓ సాధారణ యువకుడు.. పైలట్ ఎలా అయ్యాడు? మధ్య ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు. స్టోరీ బాగానే ఉన్నా.. కథలో కాస్త ల్యాగ్ ఉండటం వల్ల థియేటర్లలో సరిగా ఆడలేదు. ఓటీటీలో కాబట్టి చూసేయొచ్చు. (ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!) ఆ ఓటీటీలో 'నారాయణ & కో' 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'తో గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ కోమకుల హీరోగా నటించి నిర్మించిన సినిమా 'నారాయణ & కో'. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా తీసిన ఈ చిత్రం.. జూన్ 30న థియేటర్లలో రిలీజైంది. దాదాపు రెండు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. అనుకోకుండా ఎదురైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఓ కుటుంబం చేసిన తింగరి పనులే 'నారాయణ & కో' సినిమా మెయిన్ స్టోరీ. వీటితోపాటు 'డీడీ రిటర్న్స్' అనే తమిళ డబ్బింగ్ చిత్రం, 'స్కామ్ 2003: ఏ తెల్గీ స్టోరీ' అనే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్.. తాజాగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేశాయి. మరి ఇంకెందుకు లేటు. ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమాలు, వెబ్ సిరీస్‌పై ఓ లుక్కేయండి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?) -
‘నారాయణ & కో’ మూవీ రివ్యూ
టైటిల్: ‘నారాయణ & కో’ నటీనటులు: సుధాకర్ కోమకుల, ఆర్తిపొడి, దేవి ప్రసాద్, ఆమని, పూజ కిరణ్, సప్తగిరి తదితరులు నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్, సుధాకర్ కోమకుల దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి సంగీతం: సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాస్తవ్ విడుదల తేది: జూన్ 30, 2023 కథేంటంటే.. నారాయణ(దేవి ప్రసాద్), జానకి(ఆమని) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. నారాయణ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. పెద్ద కొడుకు ఆనంద్(సుధాకర్ కోమకుల) క్యాబ్ డ్రైవర్. క్రికెట్లో బెట్టింగ్ పెడుతుంటాడు. దీంతో అతనికి రూ.10 లక్షల వరకు అప్పు అవుతుంది. చిన్న కొడుకు సుభాష్ (జై కృష్ణ) కెమెరామెన్. ఓ చావు ఇంటికి ఫోటోలు తీయడానికి వెళ్లి ఓ అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోని పంపి, రూ. 10 లక్షలు ఇవ్వకుంటే ఆది వైరల్ చేస్తానని బెదిరిస్తాడు ఓ అజ్ఞాత వ్యక్తి. మరోవైపు నారాయణ పని చేసే బ్యాంకులో రూ.25 లక్షల దొంగతనం జరుగుంది. అది నారాయణ మీదకు వస్తుంది. రూ.25 లక్షలు తిరిగి ఇవ్వకుంటే పోలీసు కేసు పెడతానని మేనేజర్ బెదిరిస్తాడు. దీంతో నారాయణ ఫ్యామిలీ అంతా డబ్బు కోసం ఎవరినైనా కిడ్నాప్ చేయాలని భావిస్తారు. నారాయణ మేనకోడలు నళిని(పూజా కిరణ్)తో కలిసి కిడ్నాప్‌కి ప్లాన్ చేస్తే వర్కౌట్ కాదు. ఇదే సమయంలో వారికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రౌడీ శంకర్(తోటపల్లి మధు) తరపున ఓ డీల్ వస్తుంది. ముంబైకి వెళ్లి ఓ పిల్లి బొమ్మను తీసుకువస్తే.. రూ. కోటి ఇస్తామని ఆఫర్ ఇస్తారు. దీంతో నారాయణ ఫ్యామిలీ వెంటనే ఆ డీల్ ఒప్పుకుంటారు. మరి ఒప్పందం ప్రకారం పిల్లి బొమ్మను నారాయణ& కో తీసుకొచ్చిందా? పిల్లి బొమ్మను తీసుకొచ్చే క్రమంలో నారాయణ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు ఆ పిల్లి బొమ్మలో ఏం ఉంది? బ్యాంకులో డబ్బులు కొట్టేసింది ఎవరు? సుభాష్‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నదెవరు? ఎస్సై అర్జున్(అలీ రెజా) వారిని ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. విశ్లేషణ అనుకోకుండా వచ్చిన ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకు ఓ కుటుంబం అంతా కలిసి చేసే తింగరి పనులే ‘నారాయణ అండ్ కో మూవీ కథ. అందుకే ఈ చిత్రానికి ‘ది తిక్కల్ ఫ్యామిలీ ’ట్యాగ్ లైన్ పెట్టారు. దానికి తగ్గట్టే కథనం సాగుతుంది. కానీ ప్రతి సన్నివేశం గత సినిమాలను గుర్తుకు తెస్తుంది. కథ-కథనంలో ఎలాంటి కొత్తదనం లేకపోగా చాలా వరకు సీన్స్ బోర్ గా కొనసాగుతాయి. నారాయణ ఫ్యామిలీ పాత్రల పరిచయాలతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరోహీరోయిన్లు పబ్‌లో కలసుకోవడం.. ప్రెగ్నెంట్ అయ్యానంటూ పెళ్లి చేసుకోవడం.. చకచకా జరిగిపోతుంది. అయితే హీరోపై హీరోయిన్‌కి లవ్ పుట్టే రీజన్ కన్విసింగ్‌గా అనిపించలేదు. కొన్ని కామెడీ సన్నివేశాలతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక సెకండాఫ్ మాత్రం రొటీన్‌గా సాగుతుంది. కథ-కథనమే బోరింగ్ అనుకుంటే.. సంబంధం లేకుండా వచ్చే పాటలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. ఓవరాల్‌గా ‘నారాయణ అండ్ కో’ ప్రేక్షకులను నవ్వించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయింది. ఎవరెలా చేశారంటే.. ఆనంద్ పాత్రకు సుధాకర్ న్యాయం చేశాడు. ఈ సినిమాలో డ్యాన్స్ కూడా అదరగొట్టాడు. హీరో తమ్ముడు సుభాష్‌గా జైకృష్ణ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కొత్తదనం ఎంటంటే.. దేవీ ప్రసాద్, ఆమని పూర్తిగా కామెడీ రోల్ ప్లే చేయడం. నారాయణగా దేవీ ప్రసాద్, జానకిగా ఆమని చేసే కొన్ని కామెడీ సీన్స్ అలరిస్తాయి. సినిమాలో వీరిద్దరికే ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఎస్సై అర్జున్‌గా అలీ రెజా, ప్రీతిగా ఆర్తిలు ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే వీరి పాత్రల నిడివి చాలా తక్కువ. సప్తగిరి కామెడీ వర్కౌట్ కాలేదు. పూజ కిరణ్, తోటపల్లి మధుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాకొస్తే సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ సంగీతం పర్వాలేదు. ‘దండక డన్ డన్’ మినహా మిగతా పాటలేవి ఆకట్టుకోలేవు. బీజీఎం ఓకే. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాత విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
అందుకే ఈ సినిమా నిర్మించా!
‘‘నారాయణ అండ్ కో’ కథని డైరెక్టర్ చిన్నా చెప్పినప్పుడు గమ్మత్తుగా అనిపించింది. ఫ్యామిలీ అండ్ క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకునేలా ఉంటుంది’’ అని సుధాకర్ కోమాకుల అన్నారు. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘నారాయణ అండ్ కో’. పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కోమాకుల నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ– ‘‘నాకు నిర్మాణంపై ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. మొదటి నుంచి వీడియోస్, కవర్ సాంగ్స్ చేస్తూనే ఉన్నాను. సినిమా నిర్మాణంలోకి రావాలనుకున్నప్పుడు ‘నారాయణ అండ్ కో’ సరైన సినిమా అనిపించింది. నాకు వినోదం అంటే చాలా ఇష్టం. ఈ మూవీలో పూర్తి స్థాయి వినోదం పంచే పాత్ర చేసే అవకాశం దక్కింది. ఇక పదేళ్లకు పైగా ఉన్న నా సినీ ప్రయాణంలో రావాల్సినంత ఫేమ్ రాలేదు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా తర్వాత మరో సోలో చిత్రం పడుంటే నా కెరీర్ తర్వాతి స్థాయికి వెళ్లేది. డైరెక్టర్ అనిల్ రావిపూడి నాకు మంచి స్నేహితుడు. తన సినిమాలో ఓసారి మంచి పాత్ర చేసే అవకాశం వచ్చింది.. కానీ చేయలేక΄ోయాను. నాకు సరైన పాత్ర ఇవ్వాలని అనిల్‌కి కూడా ఉంది. ‘క్రాక్’ సినిమా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చాయి. కానీ, నేనే ఆసక్తి చూపలేదు.. లీడ్ రోల్స్‌పైనే దృష్టి పెట్టాను. ప్రస్తుతం ‘జీడీ’ (గుండెల్లో దమ్ము) సినిమాతో పాటు 1980 నేపథ్యంలో ఒక ప్రేమకథా చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. -
నారాయణతో సుధాకర్‌కి బ్రేక్ వస్తుంది: అనిల్ రావిపూడి
‘‘నారాయణ అండ్ కో’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సుధాకర్ నా స్నేహితుడు. తనతో నాది లాంగ్ జర్నీ. తనకి ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో చక్కని టేకాఫ్ వచ్చింది. ‘నారాయణ అండ్ కో’తో మంచి బ్రేక్ వస్తుందనుకుంటున్నాను’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. సుధాకర్ కోమాకుల హీరోగా చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘నారాయణ అండ్ కో’. పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కోమాకుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. (చదవండి: 'ఆదిపురుష్' ఎఫెక్ట్.. ఆ 'రామాయణం' మళ్లీ రిలీజ్) ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు దర్శకులు అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడల, హీరో తిరువీర్, నిర్మాత రాజ్ కందుకూరి, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అతిథులుగా హాజరై, ‘నారాయణ అండ్ కో’ విజయం సాధించాలి అన్నారు. సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ– ‘‘నారాయణ అండ్ కో’ సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా’’ అన్నారు. ‘‘ఇది ఫ్యామిలీ ఫండింగ్ మూవీ. చాలామంది సపోర్ట్‌తో ఈ సినిమా చేశాం’’ అన్నారు దర్శక–నిర్మాత చిన్నా పాపిశెట్టి.