విజయ్-సమంత నటించిన 'ఖుషి' థియేటర్లలోకి వచ్చేసింది. ఆలోవర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. అయితే ఈ వారం ఓటీటీలో పెద్దగా చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు రిలీజ్ కాలేదు. ఓ డబ్బింగ్ మూవీ, వెబ్ సిరీస్ మాత్రమే విడుదలయ్యాయి. అలాంటిది ఓ రెండు తెలుగు మూవీస్.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? ఎందులో రిలీజ్ అయ్యాయి?
ఆ ఓటీటీలో 'ఉస్తాద్'
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా. ఇప్పుడిప్పుడు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్'. ఆగస్టు 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ఓ సాధారణ యువకుడు.. పైలట్ ఎలా అయ్యాడు? మధ్య ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు. స్టోరీ బాగానే ఉన్నా.. కథలో కాస్త ల్యాగ్ ఉండటం వల్ల థియేటర్లలో సరిగా ఆడలేదు. ఓటీటీలో కాబట్టి చూసేయొచ్చు.
(ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!)
ఆ ఓటీటీలో 'నారాయణ & కో'
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'తో గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ కోమకుల హీరోగా నటించి నిర్మించిన సినిమా 'నారాయణ & కో'. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీసిన ఈ చిత్రం.. జూన్ 30న థియేటర్లలో రిలీజైంది. దాదాపు రెండు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. అనుకోకుండా ఎదురైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఓ కుటుంబం చేసిన తింగరి పనులే 'నారాయణ & కో' సినిమా మెయిన్ స్టోరీ.
వీటితోపాటు 'డీడీ రిటర్న్స్' అనే తమిళ డబ్బింగ్ చిత్రం, 'స్కామ్ 2003: ఏ తెల్గీ స్టోరీ' అనే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్.. తాజాగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేశాయి. మరి ఇంకెందుకు లేటు. ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమాలు, వెబ్ సిరీస్‌పై ఓ లుక్కేయండి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?)
Comments
Please login to add a commentAdd a comment