సుధాకర్‌కి ఉందిలే మంచి కాలం ముందు ముందునా...
సుధాకర్‌కి ఉందిలే మంచి కాలం ముందు ముందునా...
Published Mon, Oct 28 2013 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న పాత్రల్లో సుధాకర్‌ది ఒకటి. మాస్ టచ్ ఉన్న ఆ పాత్రలో సుధాకర్ కోమాకుల చక్కగా ఒదిగిపోయారు. దాంతో కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉందని చాలామంది జోస్యం చెప్పారు. బహుశా సుధాకర్ కూడా ఆ సినిమా చేస్తున్నప్పుడు మంచి కాలం ముందుంది అని ఊహించి ఉండరు. కానీ, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ విడుదల తర్వాత తనకు మంచి ఆఫర్లు వచ్చాయి. వాటిలో ఓ చక్కని రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ని ఎంపిక చేసుకున్నారు సుధాకర్. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ దాస్యం దర్శకుడు.
ఈ నెల 17 నుంచి వైజాగ్‌లో ఈ చిత్రం షెడ్యూల్ జరుపుతున్నారు. అలాగే ఈ చిత్రానికి ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక పాజిటివ్ ఫీల్ ఉన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ. యువతీ యువకుల కలల్నీ కలవరాల్నీ ఇందులో నిజాయితీగా ఆవిష్కరిస్తున్నాం. సీనియర్ కథానాయికలు రాధిక, పూర్ణిమ చాలా విరామం తర్వాత చేస్తున్న తెలుగు సినిమా మాదే కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం జరుపుతున్న షెడ్యూలు నవంబర్ 23 వరకూ జరుగుతుంది’’ అని తెలిపారు. అవంతికా మోహన్, రాధిక, నరేష్, పూర్ణిమ, షకలక శంకర్, కార్తీక్ జీఎస్, నీతూ చౌదరి, దయానంద్, సంతోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రామ్‌నారాయణ్, కెమరా: ఈశ్వర్, ఫైట్స్: ప్రకాష్, నిర్మాణం ఆమ్ టీమ్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అరుణ్ దాస్యం.
Advertisement
Advertisement