చిరు ఫిదా: హారికకే ఎక్కువ మార్కులు | Megastar voice message to Chiranjeevi fanSudhakar Komakula  | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ ఫిదా: హారికకే ఎక్కువ మార్కులు

Published Fri, Aug 28 2020 1:09 PM | Last Updated on Fri, Aug 28 2020 2:25 PM

Megastar voice message to Chiranjeevi fanSudhakar Komakula  - Sakshi

సాక్షి, హైదరాబాద్: చిరంజీవి వీరాభిమాని, యంగ్ హీరో సుధాకర్ కోమాకుల తన భార్య హారికతో కలిసి అందించిన బర్త్ డే గిఫ్ట్ కు మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయిపోయారు. ఈ మేరకు సుధాకర్‌-హారిక దంపతులకు అభినందనలు  తెలుపుతూ చిరంజీవి ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. 'డాన్స్ రీ-క్రియేషన్' అద్భుతంగా ఉందంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఆ పాట తీస్తున్నంత సేపు తనను తలుచుకోవడం ఇంకా ఆనందంగా ఉందన్నారు.
(చదవండి: నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నా! )

అంతేకాదు టెక్ గర్ల్ హారిక అంత ఈజ్‌తో గ్రేస్ఫుల్ స్టెప్పులు వేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ విషయంలో నీకంటే హారికకే  ఎక్కువ మార్కులు ఇస్తున్నానంటూ సుధాకర్‌ను ఉడికించారు. అమెరికాలో ఉన్నారు కనుక వ్యక్తిగతంగా మీ ఇద్దర్నీ కలవలేకపోతున్నాను. కలకాలం హాయిగా ఉండండి అంటూ సుధాకర్‌-హారిక దంపతులను మెగాస్టార్ ఆశీర్వదించారు. దీంతో  వారు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

కాగా చిరంజీవి నటించిన 'ఛాలెంజ్'లో అల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ 'ఇందువదన కుందరదన.. పాటను 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' నటుడు సుధాకర్ కోమాకుల తన శ్రీమతి హారికతో కలిసి రీక్రియేట్ చేయడం, అది కాస్తా సోషల​ మీడియాలో దూసుకుపోవడం తెలిసిందే.
(చదవండి: అలాంటి కథలు నమ్మొద్దు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement