పబ్లిక్ లైఫ్ ఓ సర్కస్..మీడియాపై షారుక్ మండిపాటు
పబ్లిక్ లైఫ్ ఓ సర్కస్..మీడియాపై షారుక్ మండిపాటు
Published Sun, Aug 31 2014 4:09 PM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM
ముంబై: సర్కస్ లాంటి ప్రజా జీవితంలో తన కుమారుడు అబ్ రామ్ భాగం కానివ్వనని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం సర్రోగసి పద్దతి ద్వారా షారుక్ దంపతులకు అబ్ రామ్ జన్మించిన సంగతి తెలిసిందే. అబ్ రామ్ ను బయటకు తీసుకు వెళ్లడానికి తనకు ఇష్టం ఉండదు. ఓకవేళ తాను ఇంట్లోకి రావడానికి అనుమతిస్తే వచ్చి చూడండి అంటూ తీవ్రంగా స్పందించారు. ఫ్లాష్ లైట్ల కోసమే అబ్ రామ్ లేడని.. సర్కస్ లాంటి పబ్లిక్ జీవితంలో భాగస్వామిని చేయబోనని ఓ వార్తా ఏజెన్సికిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
34 వారాలకే పట్టిన తన కుమారుడు అనారోగ్యానికి గురై ఎక్కువ కాలం ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఆసమయంలో కేరీర్ లో ఎప్పుడూ ఎదర్కోనంతగా అత్యంత క్లిష్టమైన పరిస్థితి, క్షణాల్ని ఎదుర్కొన్నాను. అనారోగ్యానికి గురైన పసిపిల్లాడి జీవితంతో మీడియా ఓ సమస్యగా చిత్రీకిరించింది. ఆ సంఘటనలు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా.. అగౌరవపరిచాయని షారుక్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఓ సినీ నటుడ్ని కావాలంటే నాతో అమర్యాదగా ప్రవర్తించండి.. నాపిల్లలతో కాదు అంటూ షారుక్ ఘాటుగా స్పందించారు. ఒకవేళ నా కుమారుడు అబ్ రామ్ తో బయటకు రావాలనిపించినపుడు తప్పకుండా ప్రజా జీవితంలోకి తీసుకువస్తాను అని అన్నారు.
Advertisement
Advertisement